ఎస్ఈసీ ఆదేశాలపై కొడాలి నాని పిటిషన్: హైకోర్టులో ముగిసిన వాదనలు, రేపు తీర్పు

By Siva KodatiFirst Published Feb 17, 2021, 5:11 PM IST
Highlights

మంత్రి కొడాలి నాని  పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. రేపు దీనిపై న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. మీడియాతో మాట్లాడొద్దన్న ఎస్ఈసీ ఆదేశాలపై మంత్రి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే

మంత్రి కొడాలి నాని  పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. రేపు దీనిపై న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. మీడియాతో మాట్లాడొద్దన్న ఎస్ఈసీ ఆదేశాలపై మంత్రి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

సోమవారం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు విచారణను వాయిదా వేసింది.. మంత్రి కొడాలి నాని, ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాదులు సమర్పించిన వీడియో టేపులతో ధర్మాసనం సంతృప్తి చెందలేదు.

దీంతో పూర్తిస్థాయి వీడియో టేపులను రాతపూర్వకంగా సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 17కి వాయిదా వేసింది. ఐతే ఈ కేసును మరింత లోతుగా విచారించాలని భావించిన న్యాయస్థానం.. కోర్టుకు సహాయపడేందుకు అమిస్ క్యూరిని నియమిస్తున్నట్లు తెలిపింది. అమిస్ క్యూరీగా సీనియర్ న్యాయవాదిని నియమిస్తామని తెలిపింది.

మీడియా సమావేశంలో మంత్రి కొడాలి నాని ఎన్నికల కమిషనర్ ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. దానిపై మంత్రి వివరణ సరిగా లేకపోవడంతో ఆయన్ను మీడియాతో మాట్లాడకుండా నిషేధించడమే కాకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పోలీసులును ఆదేశించారు.

click me!