టీటీడీ ఈవోకు హైకోర్టు నోటీసులు..

By SumaBala Bukka  |  First Published Jun 16, 2022, 12:03 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనను నియామకం చేస్తూ జారీ చేసిన జీవో మీద సవాల్ కు స్పందించిన కోర్టు ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. 


అమరావతి : టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న ఐడీఈఎస్‌ అధికారి ఏవీ ధర్మారెడ్డికి.. ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ) అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే 8న జీవో జారీచేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై.. హై కోర్టు స్పందించింది. ప్రతివాదులుగా ఉన్న ఇన్‌ఛార్జి ఈవో ఏవీ ధర్మారెడ్డి, సిబ్బంది, తితిదే దేవస్థానాల మేనేజ్‌మెంట్‌ కమిటీకి నోటీసులు జారీచేసింది.

తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) అదనపు కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న ఐడీఈఎస్‌ అధికారి ఏవీ ధర్మారెడ్డికి ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ) అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే 8న జారీచేసిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ప్రతివాదులుగా ఉన్న ఇన్‌ఛార్జి ఈవో ఏవీ ధర్మారెడ్డి, సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ సీఎస్‌, సాధారణ పరిపాలనాశాఖ ముఖ్యకార్యదర్శి, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, తితిదే దేవస్థానాల మేనేజ్‌మెంట్‌ కమిటీకి నోటీసులు జారీచేసింది.

Latest Videos

undefined

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు.  ఈ వ్యవహారం సర్వీసు అంశమా? లేదా ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించాలా? అనే విషయంపై సందేహం ఉందన్నారు. ముందుగా ఆ విషయంపై స్పష్టత ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి సూచించారు.  విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. ధర్మారెడ్డికి ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాలు చేస్తూ తిరుపతికి చెందిన పి.నవీన్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. 

ఏపీ దేవాదాయచట్టం సెక్షన్‌ 107 ప్రకారం జిల్లా కలెక్టర్‌ లేదా ఆ ర్యాంక్‌కు తగ్గని అధికారిని మాత్రమే తితిదే ఈవోగా నియమించాల్సి ఉందన్నారు. ఈవో పోస్టు నిర్వహించేందుకు ధర్మారెడ్డికి అర్హత లేదన్నారు.
 

click me!