Justice Chandru: అవగాహన లేని మాట‌లు.. జ‌స్టిస్ చంద్రు వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

By Mahesh Rajamoni  |  First Published Dec 14, 2021, 7:42 AM IST

Justice Chandru: మద్రాసు హైకోర్టు మాజీ  న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రు ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌లపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. జై భీమ్‌ సినిమా చూశాక ఆయ‌న‌పై గౌరవం పెరిగింద‌నీ, ప్ర‌స్తుతం ఆయ‌న వ్యాఖ్య‌ల‌తో ఆ గౌర‌వం పోయింద‌ని జస్టిస్‌ బట్టు దేవానంద్ అన్నారు.  సుమోటోగా కోర్టుధిక్కరణ చ‌ర్య‌లు తీసుకోవాల‌నుకున్నాం కానీ ఆయ‌న న్యాయ వ్య‌వ‌స్థ‌కు చేసిన సేవ‌, వ‌య‌స్సు రీత్యా దానిని విర‌మించుకున్నామంంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 


Justice Chandru:  ప్ర‌ముఖ త‌మిళ హీరో సూర్య న‌టించిన జైభీమ్ సినిమాతో చాలా మందికి తెలిసిన వ్య‌క్తి జ‌స్టిస్ చంద్రు.  అయితే, ఇటీవ‌ల ఆయ‌న ఆంధ్రప్ర‌దేశ్ న్యాయ‌స్థానంపై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి.  మ‌ద్రాస్ హైకోర్టు న్యాయ‌మూర్తిగా సేవ‌లందించిన జ‌స్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆయ‌న అవ‌గాహ‌న లేకుండా మాట్లాడిన‌ట్టుంది అని పేర్కొన్న న్యాయ‌స్థానం..  హైకోర్టు మొత్తాన్ని నిందిస్తూ వ్యాఖ్యలు చేయడమేమిటని ప్రశ్నించింది. కొన్ని సంఘటనలు, న్యాయ‌మూర్తుల‌పై అభ్యంత‌రాలు  ఉంటే సంబంధిత విష‌యం వ‌ర‌కు మాత్ర‌మే పరిమితమై పోరాడాలి పేర్కొంది. హైకోర్టు మొత్తంపై నింద మోపడం సరైంది కాద‌నీ తెలిపింది.  ‘జై భీమ్‌’ సినిమాలో న్యాయవాదిగా కథానాయకుడి పాత్ర చూశాక.. జస్టిస్‌ చంద్రుపై గౌరవం పెరిగిందనీ పేర్కొన్న జ‌స్టిస్ బ‌ట్టు దేవానంద్‌.. ఆయ‌న విజ‌య‌వాడ‌కు వ‌చ్చి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కోర్టుపై అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఆయ‌న‌పై పెరిగిన గౌర‌వం  పోయింద‌ని అన్నారు. ఆయ‌న రాష్ట్ర విష‌యాలు, ఇత‌ర విష‌యాల ప‌ట్ల అవ‌గాహ‌న లేకుండా మాట్లాడిన‌ట్టుంద‌ని ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు.

Also Read: Farooq Abdullah | దేశ విభజనపై ఫ‌రూక్ అబ్దుల్లా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

Latest Videos

 

మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ చంద్రు ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టుపై చేసిన వ్యాఖ్య‌లు నిరాధార‌మైన‌వ‌ని జ‌స్టిస్ బ‌ట్టు దేవానంద్ అన్నారు.  ప్రజల ప్రాథమిక, మానహ హక్కుల పరిరక్షణ కోసం హైకోర్టు ఆదేశాలిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుతో పోరాడాల్సి వస్తోందని జస్టిస్‌ చంద్రు అనడం ఏ విధంగా సమంజసమని ప్రశ్నించింది. ఈ వ్యాఖ్య‌లు నిరాధార‌మైన‌వి. అలాగే, రాష్ట్ర హైకోర్టు ప్ర‌తిష్ఠ‌ను దిగ‌జార్చేవి అని జ‌స్టిస్ బ‌ట్టు దేవానంద్ అన్నారు.  రాష్ట్రంలో పరిస్థితుల గురించి అవగాహన లేకుండా ఆయన మాట్లాడినట్లుందని.. ఆ వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించిరు.  జ‌స్టిస్ చంద్రు వ్యాఖ్య‌ల‌తో పాటు సోష‌ల్ మీడియాలో న్యాయ‌మూర్తులు, న్యాయ‌స్థానాల‌పై వ్యాఖ్యానించ‌లేని విధంగా పోస్టులు పెడుతున్నార‌ని అన్నారు. అలాంటి ఘ‌ట‌న‌ల‌పై సీబీఐతో కేసు పెట్టించి, దర్యాప్తు చేయించడం తప్పెలా అవుతుందని జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ప్రశ్నించారు.

Also Read: పార్ల‌మెంట్‌లో CBSE ర‌గ‌డ‌.. క్షమాపణల‌కు సోనియా డిమాండ్ !
ఇక రాష్ట్ర హైకోర్టు సుమోటోగా స్వీక‌రించిన అంశాల‌ను గురించి సైతం జ‌స్టిస్ బట్టు దేవానంద్ ప్ర‌స్తావించారు. పాఠ‌శాల  ప్రాంగణాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్వహిస్తుంటే వాటిని తొలగించాలని ఆదేశాలిస్తే ఏడాది వరకు అధికారులు కన్నెత్తి చూడ‌లేద‌ని పేర్కొన్న ఆయ‌న‌.. దీనిని  సుమోటోగా కోర్టుధిక్కరణ చర్యలు దిగిన వెంట‌నే వాటిని తొల‌గించిన విష‌యాన్ని గుర్తు చేశారు.  ఇలాంటి చర్య పేద విద్యార్థుల హక్కులను కాపాడటం కాదా? ప్రభుత్వం ఉపాధి బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో పలువురు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అలాంటి ఘటనలకు పాల్పడొద్దు.. న్యాయం జరుగుతుందని వారికి కోర్టు విజ్ఞప్తి చేయలేదా?  అని ప్ర‌శ్నించారు. కేవ‌లం పౌరుల పట్ల పోలీస్ స్టేష‌న్ల‌లో జ‌రిగే హింస‌, వేధింపులే హక్కుల ఉల్లంఘన కాదు. సమాజంలో చాలారకాలుగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి. వాటిని నియంత్రించడంలో న్యాయస్థానాలది కీలకపాత్ర పోషిస్తున్నాయ‌ని జ‌స్టిస్ బట్టు దేవానంద్ తెలిపారు.  న్యాయ‌స్థానాల తీర్పుల‌పై అభ్యంత‌రాలు ఉంటే.. పైకోర్టుకు వెళ్లాలి కానీ.. ప్ర‌జా హ‌క్కులు, ఇత‌ర అంశాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న న్యాయ‌స్థానాల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డ‌మేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. జడ్జీలు, న్యాయవాదులు, సిబ్బంది, కక్షిదారులకు సౌకర్యాల లేమి వెంటాడుతోందని.. అయినా ప్రజలకు న్యాయం అందించాలనే తపనతో పనిచేస్తున్నామని చెప్పారు.

Also Read: Coronavirus: తగ్గుతున్న కరోనా కొత్త కేసులు.. పెరుగుతున్న ఒమిక్రాన్ !

click me!