ఎమ్మెల్యే బోండా ఉమపై చర్యలు తీసుకొండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం

By Arun Kumar PFirst Published Oct 17, 2018, 1:36 PM IST
Highlights

అధికార పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఉమతో పాటు ఆయన భార్య సహా 9 మందిపై చర్యలు తీసుకోవాలని విజయవాడ పోలీసులకు ఆదేశించింది. 

అధికార పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఉమతో పాటు ఆయన భార్య సహా 9 మందిపై చర్యలు తీసుకోవాలని విజయవాడ పోలీసులకు ఆదేశించింది. 

నకిలీ డాక్యుమెంట్లు, పోర్జరీ ఆరోపణలతో బోండా ఉమపై గతంలో రామినేని కోటేశ్వరరావు అనే వ్యక్తి విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదని... ఎన్ని రోజులు గడిచినా చర్యలు తీసుకోవడం లేదంటూ ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఉమతో పాటు ఈ కేసుతో సంబంధమున్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించింది.

విజయవాడలో ఓ భూవ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్యే ఉమకు రామినేని కోటేశ్వరరావు అనే వ్యక్తికి విభేదాలు తలెత్తాయి. దీంతో అతడు విజయవాడ పోలీసులను  ఆశ్రయించారు. అమితే అధికార ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోడానికి పోలీసులు వెనకడుగు వేయడంతో కోటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు పైవిధంగా ఆదేశించింది.   
 

click me!