పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డ పిటిషన్‌పై ప్రారంభమైన విచారణ

Siva Kodati |  
Published : Jan 12, 2021, 04:46 PM IST
పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డ పిటిషన్‌పై ప్రారంభమైన విచారణ

సారాంశం

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తూ నిన్న సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు నిమ్మగడ్డ.

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తూ నిన్న సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు నిమ్మగడ్డ. దీనిపై డివిజన్ బెంచ్ విచారణ జరుపుతోంది. ఎస్ఈసీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. 

అంతకుముందు గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్‌తో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ అయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు, తాజా పరిణామాలపై చర్చించారు.

Also Read:మరో అధికారిపై వేటేసిన నిమ్మగడ్డ: ఎన్నికల సంఘం సెక్రటరీగా వాణీ మోహన్‌ తొలగింపు

ఏ ఉద్దేశ్యంతో తాను నోటిఫికేషన్ ఇచ్చాననే విషయాన్ని గవర్నర్ దృష్టికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకెళ్లారు. హైకోర్టులో జరిగిన పరిణామాలు, తీర్పుపై అప్పీల్ చేసిన విషయాలపై గవర్నర్‌కు వివరించారు.

అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో విజయసాయి రెడ్డి చేసిన కామెంట్లను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?