విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ.. ఏపీ సర్కార్ ఏం చెప్పిందంటే..

By Sumanth KanukulaFirst Published Aug 29, 2022, 4:26 PM IST
Highlights

విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్‌‌లపై సోమవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తరపున న్యాయవాది బాలజీ వాదనలు వినిపించారు. 

 

విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్‌‌లపై సోమవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తరపున న్యాయవాది బాలజీ వాదనలు వినిపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆర్టికల్ 21కి వ్యతిరేకమని అని తెలిపారు. కోసం వేల మంది రైతుల నుంచి 22 వేల ఎకరాలు సేకరించారని చెప్పారు.  9,200 మంది రైతులకు నేటి వరకూ ఉద్యోగాలు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రైతుల కుటుంబాల్లో నాలుగోతరం వచ్చిన ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పారు. 

మరోవైపు స్టీల్ ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని అడ్వకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరామ్‌ కోర్టుకు చెప్పారు. ప్రైవేటీకరణకు ప్రత్యామ్నాయంగా అనేక మార్గాలను ప్రతిపాదించినట్టుగా వెల్లడించారు. ఈ క్రమంలోనే కేంద్రం, ఆర్‌ఐఎన్‌ఎల్, రాష్ట్ర ప్రభుత్వం, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కౌంటర్లు దాఖలు హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను సెప్టెంబర్ 21కి వాయిదా వేసింది. 

ఇదిలా ఉంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్రం మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచన లేదని పార్లమెంట్ వేదికగా తేల్చి చెప్పింది. స్టీల్ ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్రం నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. 

 

click me!