జగన్ కు షాక్: మళ్ళీ పోలవరం పనులకు బ్రేక్

By telugu teamFirst Published Nov 8, 2019, 1:08 PM IST
Highlights

పోలవరం పనులకు మరోమారు బ్రేకులు వేస్తూ హైకోర్టు జగన్ సర్కారుకు షాకిచ్చింది. 

పోలవరంలో సాగుతున్న హైడెల్ ప్రాజెక్టు పనులకు హై కోర్టు బ్రేకులు వేసింది. పోలవరం హైడల్‌ ప్రాజెక్ట్‌ పనులు నిలిపివేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. నవయుగ పిటిషన్‌పై కోర్టు విచారించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ వాదనలు కూడా వినాల్సి ఉందని హై కోర్టు తెలిపింది.  

అంతేకాకుండా, ప్రతివాదులకు కూడా న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి కూడా ఇందుకు సంబంధించిన నోటీసులను జారీ చేయమని హై కోర్ట్ ఆదేశించింది. 

తొలుత విచారణను 4వారాలపాటు వాయిదా వేయాలని హై కోర్టు భావించినా, ప్రాజెక్టులో ఆలస్యం జరగకుండా ఉండేందుకు సోమవారం కల్లా జెన్కో నుంచి పూర్తి స్థాయి నివేదికతో తాము సిద్ధంగా ఉంటామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనితో కోర్టు అంగీకరించి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. 

గతంలో పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌ విషయంలో  ఏపీ  ప్రభుత్వానికి  హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నవయుగ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకొంది.

Also read:రివర్స్ టెండరింగ్: డివిజన్ బెంచ్‌ ను ఆశ్రయించిన ఏపీ సర్కార్

కొత్త కాంట్రాక్టర్‌తో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవచ్చని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో నవయుగ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ స్టేను ఎత్తివేస్తూ హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది.పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాన అడ్డంకులు తొలగిపోవడంతో ప్రాజెక్టు పనులను మరింత వేగంగా పూర్తి చేసే అవకాశాలు ఉంటాయని  ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కానీ ఇప్పుడు ఇలా మరోసారి బ్రేకులు పడడంతో ఒకింత షాక్ లో ఉన్నారు.

Also Read:షెకావత్‌తో జగన్ భేటీ:పోలవరంపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

పోలవరం  ప్రధాన డ్యామ్‌, జలవిద్యుత్ ప్రాజెక్టు పనులను మేఘా కంపెని దక్కించుకొన్న విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.3216 కోట్ల విలువైన జల విద్యుత్ ప్రాజెక్టు, హెడ్ వర్క్స్‌కు  సంబంధించి ఈ ఏడాది ఆగష్టు 17వ తేదీన ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు నోటిఫికేషన్ ఇచ్చింది. గత ప్రభుత్వ హాయంలో పోలవరం హెడ్‌వర్క్, విద్యుత్ ప్రాజెక్టు కు సంబంధించి నవయుగ కంపెనీ కాంట్రాక్టును దక్కించుకొంది.

Also Read:రీ టెండర్ల ద్వారానే పోలవరం పనులు: పెద్దిరెడ్డి

అయితే ఈ కాంట్రాక్టును రద్దు చేస్తూ వైఎస్ జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్‌కు ఆగష్టు  17వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఈ నోటిఫికేషన్‌పై హైకోర్టును ఆశ్రయించింది నవయుగ కంపెనీ. 

పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, జల విద్యుత్ ప్రాజెక్టు పనులకు రివర్స్ టెండర్లను ఆగష్టు17న ఆహ్వానిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రివర్స్ టెండర్లను పోలవరం ప్రాజెక్టు అథారిటీ వ్యతిరేకించింది. ఈ విషయమై పీపీఏ సీఈఓ ఆర్ కే జైన్ ఏపీ ప్రభుత్వానికి ఆగష్టు 16న లేఖ రాసిన విషయం తెలిసిందే.

జల విద్యుత్ ప్రాజెక్టు పనుల విషయంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ టెండర్లను అప్ లోడ్ చేయలేదు. కానీ., ఈ టెండర్లను అప్ లోడ్ చేసేందుకు జెన్ కో అన్ని రకాల ఏర్పాట్లను చేసింది.

పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వం నవయుగ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొంది.ఈ ఒప్పందాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేస్తూ రివర్స్ టెండర్లను ఆహ్వానించింది. దీంతో నవయుగ కంపెనీ సెప్టెంబర్ 20వ తేదీన హైకోర్టును ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ నవయుగ కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 

సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులకు అనుకూలంగా ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను  ఆశ్రయించింది.నవయుగ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌పై స్టేను ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు మేఘా కంపెనీకి ఆటంకాలు లేకుండాపోయాయి.

click me!