హెరిటేజ్, లింగమనేనికి లబ్ది చేకూర్చారు: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై హైకోర్టులో వాడీ వేడీ వాదనలు

By narsimha lode  |  First Published Sep 29, 2023, 5:26 PM IST


అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హెరిటేజ్ సంస్థ, లింగమనేని  రమేష్ సంస్థలకు  లబ్దిపొందేలా చంద్రబాబు సర్కార్ వ్యవహరించిందని  ఏజీ  వాదించారు.  


అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ సందర్భంగా  చంద్రబాబు తరపు న్యాయవాదులు, ఏజీ శ్రీరామ్ మధ్య  వాడీ వేడీ వాదనలు జరిగాయి.ఇన్నర్ రింగ్ రోడ్డు మార్గంలో లింగమనేనికి పెద్ద ఎత్తన భూములున్నాయని  ఏజీ శ్రీరామ్ వాదించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో  లింగమనేని, హెరిటేజ్ సంస్థలకు లబ్ది చేకూరేలా నిర్ణయాలు జరిగాయని ఏజీ వాదించారు.  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పై శుక్రవారం నాడు మధ్యాహ్నం విచారణ  నిర్వహించింది. 

అమరావతి ఇన్నర్ రింగ్ అలైన్ మెంట్ మార్పులతో  లింగమనేని రమేష్ కు లబ్ది జరిగిందని  ఏజీ శ్రీరామ్ హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.లింగమనేని  రమేష్ ఇంట్లో ఉన్న చంద్రబాబు హెచ్ఆర్ఏచెల్లించలేదన్నారు. కానీ ఆ తర్వాత  భువనేశ్వరి అకౌంట్ నుండి లింగమనేని రమేష్ కు  అద్దె చెల్లించారని  ఏజీ ఆరోపించారు.లింగమనేని రమేష్ ఎకరానికి రూ. 10 లక్షలకు భూమి కొనుగోలు చేస్తే  మాస్టర్ ప్లాన్ తర్వాత  ఎకరం భూమికి రూ. 35 లక్షలకు చేరిందని ఏజీ చెప్పారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో  హెరిటేజ్ , లింగమనేని రమేష్ కు లబ్ది చేకూరేలా  చంద్రబాబు సర్కార్ వ్యవహరించిందని ఏజీ  వాదించారు. 

Latest Videos

undefined

also read:మొత్తం నాలుగు కేసుల్లో ఆధారాలున్నాయి: చంద్రబాబు కేసులపై సజ్జల

ఇదిలా ఉంటే ఈ విషయమై  చంద్రబాబు తరపు న్యాయవాది సిద్దార్ధ్ లూథ్రా  వర్చువల్ గా వాదనలు విన్పించారు.  చంద్రబాబు, భువనేశ్వరికి  నోటీసులు ఇవ్వవచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు.  చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడానికి  లింగమనేని రమేష్ వ్యవహరాన్ని ముడిపెట్టవద్దని లూథ్రా వాదించారు.  లింగమనేని రమేష్ కు అద్దె చెల్లింపు విషయంలో నోటీసు ఇస్తే అద్దె చెల్లింపులపై పూర్తి వివరాలు అందిస్తారని లూథ్రా హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఈ పిటిషన్ లో ఇంకా వాదనలకు  ఇవాళ సమయం మించిపోయింది. దీంతో ఈ పిటిషన్ పై విచారణను  అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. అక్టోబర్ 3న  ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించనున్నారు.

click me!