ఆన్‌లైన్ లో రమ్మీ గేమ్: సత్యసాయి జిల్లాలో హేమంత్ సూసైడ్

By narsimha lodeFirst Published Sep 4, 2022, 10:43 AM IST
Highlights

సత్యసాయి జిల్లాలో ఆన్ లైన్ లో రమ్మీ గేమ్ ఆడి అప్పుల పాలైన హేమంత్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

అనంతపురం:సత్యసాయి జిల్లాలో ఆన్ లైన్ లో రమ్మీ గేమ్ ఆడి అప్పుల పాలైన హేమంత్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ  ఘటనకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు  ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సత్యసాయి జిల్లాలోని  ఓడిచర్ల మండలం కొండకమర్లకు  చెందిన హేమంత్ అనే యువకుడు తన సెల్ ఫోన్ లో ఆన్ లైన్ లో రమ్మీ గేమ్ కు అలవాటు పడ్డారు. అయితే ఈ గేమ్ ఆడేందుకు గాను అప్పులు చేశాడు. ఈ గేమ్  కోసం రూ. 3 లక్షలు అప్పులు చేశాడు. ఈ అప్పులు తీర్చే మార్గం  లేకుండా పోయింది. అప్పులు ఇచ్చిన వారి నుండి ఒత్తిడి పెరిగింది. దీంతో హేమంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

గతంలో కూడా ఆన్ లైన్  రమ్మీకి అలవాటుపడి అప్పుల పాలైన పలువురు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు దేశంలోని పలు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి.తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో ఆన్ లైన్ రమ్మీకి బానిసగా మారిన నరసింహరాజు అనే వ్యక్తి  తన భార్యను హత్య చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నరసింహరాజు తమిళనాడులో స్థిరపడ్డాడు.తమిళనాడుు చెందిన శివరంజనిని వివాహం చేసుకుంది.  

తిరుచ్చిలోని తాలకుడి సాయినగర్ లో నరసింహరాజుకు స్వంత ఇల్లు ఉంది. అయితే ఆన్ లైన్ రమ్మీకి అలవాటు పడిన నరసింహరాజు అప్పులు చేసి ఈ ఇంటిని విక్రయించాడు. ఈ విషయమై భర్తను శివరంజని నిలదీసింది. దీంతో మాటామాట పెరిగి భార్యను నరసింహరాజు చంపాడు. అయితే ఈ విషయం పిల్లలకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. విజయవాడలోని తన సోదరుడి వద్దకు పిల్లలను పంపాడు. ఆ త,ర్వాత ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. శివరంజని తల్లిదండ్రులు కూతురి కోసం ఇంటి వెళ్తే తాళం వేసి ఉంది.తలుపులు బద్దలు కొడితే శివరంజని మృతదేహం లభ్యమైంది. శివరంజని పేరేంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు నరసింహరాజును అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఈ ఏడాది జూలై మాసంలో చోటు చేసుకుంది.

ఇదిలా ఉంటే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై కి చెందిన వివాహిత ఆన్ లైన్ రమ్మీకి బానిసగా మారింది. 20 తులాల బంగారాన్ని తాకట్టు పెట్టి ఆన్ లైన్ రమ్మీ ఆడింది. ఆన్ లైన్ లో  రమ్మీ ఆడిన భవానీ నష్టపోయింది. దీంతో ఆమె ఈ ఏడాది జూన్ మాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

హైద్రాబాద్ లోని అంబర్ పేటకు చెందిన యువకుడు ఆన్ లైన్ లో రమ్మీ ఆడి నష్టపోయాడు. ఆన్ లైన్ లో రమ్మీ ఆడి రూ. 70 లక్షలను ఆ యువకుడు పోగోట్టుకున్నాడు. ఈ డబ్బులు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ఆ యువకుడు చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన 202 డిసెంబర్ 9వ తేదీన జరిగింది. తెలంగాణలో ఆన్ లైన్ రమ్మీని నిషేధించిన విషయం తెలిసిందే.
 

click me!