కృష్ణాజిల్లాలో విషాదం .. ట్రెక్కింగ్‌ చేస్తూ యువకుడు మృతి

Siva Kodati |  
Published : Sep 03, 2022, 09:45 PM ISTUpdated : Sep 03, 2022, 09:46 PM IST
కృష్ణాజిల్లాలో విషాదం .. ట్రెక్కింగ్‌ చేస్తూ యువకుడు మృతి

సారాంశం

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు రిజర్వ్ ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ కు వెళ్ళిన వారిలో ఒక యువకుడు మృతి చెందాడు. గమ్యానికి చేరుకునేందుకు కొద్దిదూరంలోనే పిన్నిశెట్టి సాయి తేజ అనే యువకుడు కుప్పకూలిపోయాడు. 

కృష్ణాజిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు రిజర్వ్ ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ కు వెళ్ళిన వారిలో ఒక యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. విజయవాడ కు చెందిన కొందరు యువకులు మూలపాడు రిజర్వ్ ఫారెస్ట్ కు ట్రెక్కింగ్ కు వెళ్ళారు. అయితే ట్రెక్కింగ్ కు వెళ్ళి తిరిగి గమ్యానికి చేరుకునేందుకు కొద్దిదూరంలోనే పిన్నిశెట్టి సాయి తేజ(37) అనే యువకుడు కుప్పకూలి పడిపోయాడు. దీంతో మిత్రులు అతనిని హుటాహుటిన ఇబ్రహీంపట్నం మండలం జూపూడి నిమ్రా హాస్పిటల్ కు తీసుకువెళ్ళారు. 

అయితే అప్పటికే సాయితేజ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడు సాయితేజది విజయవాడ ఎల్ఐసి నగర్. అతను ప్రస్తుతం ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. మూలపాడు రిజర్వ్ ఫారెస్ట్‌లో ట్రెక్కింగ్‌కి సాయితేజతో సహా సుమారు నలబై మంది వెళ్ళినట్లు సమాచారం. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్