ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కుప్పం వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త కృష్ణరాఘవ జయేంద్రభరత్ మర్యాదపూర్వకంగా కలిశారు. స్ధానిక సంస్ధల కోటాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కేఆర్‌జే భరత్‌కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ బీ–ఫామ్ అందజేశారు.
అమరావతి : సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కుప్పం వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త కృష్ణరాఘవ జయేంద్రభరత్ మర్యాదపూర్వకంగా కలిశారు. స్ధానిక సంస్ధల కోటాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కేఆర్‌జే భరత్‌కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ బీ–ఫామ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు పాల్గొన్నారు.
కాగా, రెండు రోజుల క్రితం నవంబర్ 18న స్థానిక సంస్థల MLC candidateగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున Krishnaraghava Jayendrabharat నామినేషన్ దాఖలు చేశారు, రిటర్నింగ్ అధికారి పి.రాజబాబుకు నామినేషన్ పత్రాలను అందించారు. కుప్పంకు చెందిన కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ కి సీఎం జగన్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. కాగా, కార్యక్రమంలో లోక్ సభ ప్యానల్ స్పీకర్ మిథున్ రెడ్డి, చిత్తూరు పార్లమెంటు సభ్యులు ఎన్.రెడ్డెప్ప, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఫార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఒక్కరొక్కరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ నవంబర్ 15, సోమవారం నాడు కలిశారు.
ఎమ్మెల్సీ స్థానానికి తనను అభ్యర్ధిగా ప్రకటించిన సీఎం జగన్ కు అరుణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ మొండితోక Arun kumar కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి Ys Jagan ఆప్యాయంగా మాట్లాడారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానం నుండి అరుణ్ కుమార్ ను వైసీపీ బరిలోకి దింపుతుంది. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల జాబితాను ఆ పార్టీ మూడు రోజుల క్రితం ప్రకటించింది.
ఈ సందర్బంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన తమకు ఎంతో ఉన్నతమైన అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి తమ కుటుంబమంతా జీవితాంతం రుణపడి ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను Ycp గతవారం ప్రకటించింది. ఇందుకూరు రాజు (విజయనగరం) వరుదు కళ్యాణి (విశాఖ)వంశీ కృష్ణయాదవ్ (విశాఖ)అనంత ఉదయ్ భాస్కర్ (తూర్పుగోదావరి)మొండితోక అరుణ్ కుమార్ (కృష్ణా)తలశిల రఘురామ్ (కృష్ణా)ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు(గుంటూరు)మురుగుడు హనుమంతరావు (గుంటూరు)తూమాటి మాధవరావు (ప్రకాశం)కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ (చిత్తూరు)వై శివరామిరెడ్డి (అనంతపురం) లను అభ్యర్ధులుగా వైసీపీ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఏపీలో mla quota ఎమ్మెల్సీల్లో 3, local body quota కోటాలో 11 స్థానాలు భర్తీకానున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుండగా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది.రాష్ట్రంలోని అన్ని ఎమ్మెల్సీ స్థానాలను వైసీపీ దక్కించుకొనే అవకాశం ఉంది.