భారీ వర్షాలు...ఏపీలోని ప్రాజెక్టుల పరిస్థితి ఇదీ (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 15, 2020, 1:36 PM IST
Highlights

 విజయవాడ ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద గంటగంటకు పెరుగుతోంది. 

అమరావతి: ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో  పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో  14 క్రస్టుగేట్లను 3 మీటర్లమేర ఎత్తి నీటిని దిగువకు విడుదల వదులుతున్నారు అధికారులు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 3,68,099 క్యూసెక్కులుగా వుండగా అవుట్ ఫ్లో 3,53,840 క్యూసెక్కులుగా వుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 44.609 టీఎంసీలుగా వుంది.  పూర్తిస్థాయి నీటిమట్టం:  175 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 174.309 అడుగులుగా వుంది. 

"

ఇక విజయవాడ ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద గంటగంటకు పెరుగుతోంది. ఈ బ్యారేజి ఇన్ ఫ్లో 3.7 లక్షల క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3.9లక్షల క్యూసెక్కులుగా వుంది. ఇక కృష్ణా జిల్లాలోని మున్నేరు, కట్టలేరు, వైరా వాగులు  ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. అలాగే పులిచింతల నుంచి వరదనీరు దిగువకు వదులుతుండటంతో ప్రకాశం బ్యారేజీకి భారీ వరద చేరుతోంది. దీంతో 70 గేట్లను ఎత్తి నీటిని విడుదల దిగువకు వదులుతున్నారు. 

ఈస్ట్రన్, వెస్ట్రన్ కెనాళ్లకు 3013 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. అన్ని డివిజనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. ఇక కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆత్మకూర్ మండలాలలో రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

 మహానంది మండలంలోని పాలేరు వాగు ఉదృతంగా ప్రవహించడంతో మహానంది, గిద్దలూరు ప్రాంత రాకపోకలు నిలిచి పోయాయి. నంద్యాలలో మద్దిలేరు వాగు, శామ కాలువలు, కుందూ నది ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.ఈ వర్షాలతో నంద్యాల మండలంలోని వరి, పత్తి మిరప, మొక్కజొన్న పంటలు, మహానంది మండలంలోని అరటి, పసుపు పంటలు నీట మునిగాయి.  అడుగు మేర వర్షపు నీరు చేరి పంటలు దెబ్బ తిన్నాయి. నంద్యాల పద్మావతి నగర్లో రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

"

ఇక తెలంగాణలోనూ కురుస్తున్న వర్షాలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 14 క్రస్టుగేట్లు 10ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ ప్రాజెక్టు ఇన్ ఫ్లో :2,48,266క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో :2,48,266 క్యూసెక్కులుగా వుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 310 టీఎంసీలుగా వుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 589.60అడుగులుగా వుంది. 

click me!