ఉత్తరాంధ్రలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

By Siva KodatiFirst Published Apr 3, 2021, 9:45 PM IST
Highlights

భానుడి ప్రతాపంతో భగభగలాడుతున్న ఉత్తరాంధ్ర కాస్త సేద తీరింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఈదురుగాలులు, మెరుపులతో కూడిన  వర్షం పడింది

భానుడి ప్రతాపంతో భగభగలాడుతున్న ఉత్తరాంధ్ర కాస్త సేద తీరింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఈదురుగాలులు, మెరుపులతో కూడిన  వర్షం పడింది.

కొమరాడ మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలికి కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

మరోవైపు ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. బయటకు రావాలంటేనే జనాలు జంకుతున్నారు. ఏప్రిల్ నెల మొదట్లోనే సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. ప్రజలు సెగ, ఉక్కపోతతో ఇంటికే పరిమితమవుతున్నారు.

దీంతో ప్రధాన రహదారులన్ని నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో సాధారణం కన్నా 5నుంచి 9డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.

తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉన్నా.. మైదాన ప్రాంతాల్లో మాత్రం అధిక ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. నేడు, రేపు కూడా ఎండ తీవ్రత కొనసాగుతుందన్నారు.

click me!