ఏపీకి భారీ వర్షసూచన.. ఈ రెండు జిల్లాలకు తీవ్ర హెచ్చరికలు

By Siva KodatiFirst Published Sep 20, 2020, 6:51 PM IST
Highlights


ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఈరోజు అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడింది. 

ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో ఈరోజు అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొలది నైరుతీదిశ వైపునకు వంపు తిరిగి ఉన్నది.

రాగల 24 గంటలలో ఇది వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. రాగల 2-3 రోజులలో ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది.

ఇక తూర్పు-పశ్చిమ shear zone 16°N Latitude వెంబడి పెనిన్సులర్ భారతదేశం మీదుగా 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్లేకొలది పైన తెలిపిన అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మీదుగా దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది.

ఉత్తరాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమలలో రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 

click me!