చిరును సీఎంను చేయడమే: అంతర్వేది ఘటనపై హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు

By telugu teamFirst Published Sep 11, 2020, 4:25 PM IST
Highlights

అంతర్వేది శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయం రథం దగ్ధం ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన రెబెల్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉండడం వల్లనే బిజెపి, జనసేన ఆందోళనకు దిగాయని ఆయన అన్నారు.

రాజమండ్రి: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ రథం దగ్ధంపై మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు అంతర్వేది ఆలయం జనసేన తిరుగుబాటు ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉండడం వల్లనే రథం దగ్ధం ఘటనను జనసేన, బిజెపి రాజకీయం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్ ద్వారా కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

బిజెపి మతాభిమానంతో, జనసేన కులాభిమానంతో కుళ్లిపోయాయని ఆయన విమర్శించారు. బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజుకు కులాభిమాన ఎక్కువ అని, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని ముఖ్యమంత్రిని చేయడమే సోము వీర్రాజు లక్ష్యమని ఆయన అన్నారు. చిరంజీవి కుటుంబానికి సోము వీర్రాజు హనుమంతుడిలా మారారని ఆయన అన్నారు. 

దళితుడికి శిరోముండనం చేయిస్తే సీబీఐ విచారణకు ఎందుకు అడగలేదని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ ఒక్కో కులానికి, మాతనికి ఒక్కోలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. దళితులపై చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి జగన్ శిరోముండనం ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన అన్నారు. 

అంతర్వేది రథం దగ్ధం ఘటనపై బిజెపి చలో అంతర్వేది కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జనసేన బిజెపికి మద్దతు ఇచ్చింది. ఈ స్థితిలో ఘటనపై జగన్ ప్రభుత్వం సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దానిపై శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. 

click me!