కాపు రిజర్వేషన్లపై హరిరామజోగయ్య పిటిషన్‌: సీజే బెంచీ‌కి బదిలీ చేస్తామన్న హైకోర్టు

By narsimha lode  |  First Published Feb 20, 2023, 3:24 PM IST

కాపులకు  రిజర్వేషన్ల అంశంపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య  దాఖలు చేసిన  పిటిషన్ ను  హైకోర్టు చీఫ్ జస్టిస్  బెంచ్ కి  బదిలీ  చేస్తామని  హైకోర్టు తెలిపింది. 


అమరావతి: కాపు  రిజర్వేషన్లపై   మాజీ మంత్రి హరిరామజోగయ్య  దాఖలు చేసిన పిటిషన్ ను  సీజే  బెంచ్ కి  బదిలీ చేస్తామని  హైకోర్టు సోమవారంనాడు  తెలిపింది. కాపు సామాజికవర్గానికి ఈడబ్ల్యుఎస్  కింద  ఐదు శాతం  రిజర్వేషన్  ను  అమలు  చేయాలని  కోరుతూ  ఈ నెల 6వ తేదీన  హరిరామజోగయ్య  ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు.  ఈ పిటిషన్  పై  ఈ నెల  7వ తేదీన  ఏపీ హైకోర్టు  విచారణ నిర్వహించింది.  ఈ పిటిషన్ పై  కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.  ఇవాళ్టికి  విచారణను  వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై  ఇవాళ  హైకోర్టు  విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ ను  హైకోర్టు చీఫ్ జస్టిస్  బెంచ్ కి  బదిలీ చేస్తామని  హైకోర్టు  తెలిపింది. 

also read:కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు: కౌంటర్ దాఖలు చేయాలని జగన్ సర్కార్ కు హైకోర్టు ఆదేశం

Latest Videos

కాపులకు  ఈడబ్ల్యుఎస్  కోటా కింద  ఐదు శాతం  రిజర్వేషన్లు  కల్పించాలని  కోరుతూ  ఏపీ సీఎం వైఎస్ జగన్  కు  హరిరామ జోగయ్య  గత ఏడాది డిసెంబర్ మాసంలో  లేఖ రాశారు. ఈ విషయమై  ప్రభుత్వం  నుండి సానుకూలంగా  స్పందించకపోతే  నిరహరదీక్షకు దిగుతానని  ఆయన  ప్రకటించారు.  అయితే  ప్రభుత్వం  నుండి సానుకూలంగా  స్పందన రాలేదని ఈ ఏడాది  జనవరి 1న దీక్షకు దిగాడు.  ఈ దీక్షను పోలీసులు భగ్నం  చేశారు. ఆసుపత్రిలో  కూడా హరిరామజోగయ్య  దీక్షను  కొనసాగించారు. జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్  దీక్షను విరమించాలని హరిరామజోగయ్యను  కోరారు.  పవన్ కళ్యాణ్  వినతి మేరకు  హరిరామజోగయ్య  తన దీక్షను విరమించారు.  కాపులకు  రిజర్వేషన్లు  కల్పించాలని కోరుతూ  హైకోర్టులో  పిటిషన్ దాఖలు  చేశారు.

click me!