
జనసేన అధినేత పవన్ కల్యాన్ కు కాపు సంక్షేమ సేన ప్రెసిడెంట్, మాజీ ఎంపీ హరి రామ జోగయ్య లేఖ రాశారు. ఇందులో పవన్ కల్యాణ్ కు పలు ప్రశ్నలు సంధించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ ఏపీకి సీఎంగా ఉంటే.. మరి జన సైనికులు కలలు ఏం కావాలని అన్నారు. నీతివంతమైన పరిపాలన అందిస్తారని ఆశిస్తున్న ప్రజానీకానికి ఏమని సమాధానం చెబుతారని, 80 శాతం జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఎప్పుడని ప్రశ్నించారు.
గోకుల్ చాట్ ఓనర్ ముకుంద్‌దాస్ కన్నుమూత..
ఇంకా ఆ లేఖలో ఏముందంటే.. ‘‘చంద్రబాబు కాబోయే ముఖ్యమంత్రి. ఈ నిర్ణయం లో రెండో మాట లేదు.. ‘అనుభవస్తుని నాయకత్వమే ఈ రాష్ట్రానికి కావాలి’ ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ అనేకసార్లు ప్రకటించారు. కనుక అందరి మాట ఇదే అంటూ లోకేష్ ప్రకటించేశారు. అయితే చంద్రబాబు పూర్తి కాలం సీఎంగా చేయటానికి మీ ఆమోదం ఉందా..? లేక లోకేష్ ఆశించినట్లుగా చంద్రబాబు పూర్తి కాలం ముఖ్యమంత్రా!. ’’ అని పేర్కొన్నారు.
చలికి వణుకుతున్న ఉత్తర తెలంగాణ.. గిన్నెధరిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు..
‘‘మరి జనసైనికుల కలలు ఏం కావాలనుకుంటున్నారు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రెండు కుల నాయకులు రాజమలుతున్నారు. 80 శాతం జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఎప్పుడు?. నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందిస్తారని ఆశిస్తున్న ప్రజానీకానికి మీరు చెప్పే సమాధానం ఏంటి?. ఈ ప్రశ్న అన్నిటికీ మీ నుండి జనసైనికులకు సంతృప్తికరమైన సమాధానాలను ఆశిస్తున్నాము. రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో మీ వైఖరి ఏంటో జనసైనికులు అందరకు అర్థమయ్యేటట్లు చెప్పవలసిందిగా కోరుతున్నాము..’’ అని హరి రామ జోగయ్య తన లేఖలో పేర్కొన్నారు.