అంతు తేలుస్తానంటూ అధికారులకు వార్నింగ్.. చిక్కుల్లో నారా లోకేష్, ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు

By Siva KodatiFirst Published Dec 22, 2023, 2:47 PM IST
Highlights

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ఏపీ సీఐడీ .. ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. అధికారులు 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం ఎలా ఇస్తారని, రెడ్ బుక్‌లో పేర్లు రికార్డ్ చేశానని , తమ ప్రభుత్వం వస్తే వారి సంగతి తెలుస్తానంటూ లోకేష్ హెచ్చరించారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ఏపీ సీఐడీ .. ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. వివరాల్లోకి వెళితే .. యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా పలు మీడియా ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు రిమాండ్ విధించడం తప్పన్నారు. అధికారులు 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం ఎలా ఇస్తారని, రెడ్ బుక్‌లో పేర్లు రికార్డ్ చేశానని , తమ ప్రభుత్వం వస్తే వారి సంగతి తెలుస్తానంటూ లోకేష్ హెచ్చరించారు. 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం నమోదు చేయడం న్యాయ విచారణ ప్రక్రియలో భాగమని.. దీనిని తప్పుబట్టంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ నేపథ్యంలో సీఐడీ స్పందించింది. విశాఖ సభలో లోకేష్ వ్యాఖ్యలు అధికారులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉన్నాయని పిటిషన్ లో పేర్కొంది సిఐడి. తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారుల పేర్లు రెడ్ డైరిలో వ్రాసుకున్నామని లోకేష్ వ్యాఖ్యలు చేశారని సీఐడీ తెలిపింది. లోకేష్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఏసిబి కోర్టును సీఐడీ కోరింది. నారా లోకేష్‌కు ఎన్‌బీడబ్ల్యూ జారీ చేయాలని కోరింది. 

మరోవైపు.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసింది సిఐడి. అయితే ఇదే కేసులో హైకోర్టును ఆశ్రయించారు లోకేష్. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం 41 ఏ నోటీసు ఇచ్చి విచారించాలని  ఆదేశించింది. నారా లోకేష్‌కు ఇప్పటికే 41A నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో .. ఈ కేసులో ఎన్‌బీడబ్ల్యూ జారీ చేయాలని ఏసీబీ కోర్టును ఆశ్రయించింది సిఐడి. 
 

click me!