రిసార్ట్సే టిడిపి తాత్కాలిక కార్యాలయం

Published : Sep 05, 2017, 09:23 AM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
రిసార్ట్సే టిడిపి తాత్కాలిక కార్యాలయం

సారాంశం

పార్టీ రాష్ట్రా కార్యాలయం నిర్మించేవరకూ తాత్కాలిక కార్యాలయంగా హ్యాపీ రిసార్ట్స్ ను వాడుకోవాలని అధినేత నిర్ణయించారు. వెంటనే రిసార్ట్స్ యాజమాన్యంతో రెండేళ్ళపాటు ఒప్పందం కుదుర్చేసుకున్నారు. అందుకే సోమవారం జరిగిన పార్టీ సమావేశం రిసార్ట్స్ లో జరిగింది. ఒప్పందం ప్రకారం మరో రెడేళ్ళ పాటు పార్టీ కార్యకలాపాలన్నీ కుడా ఇక్కడే జరుగుతాయి.

 ‘రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవేముంది’ అనే సామెతను టిడిపి నిజం చేస్తోంది. పార్టీ రాష్ట్రా కార్యాలయం నిర్మించేవరకూ తాత్కాలిక కార్యాలయంగా హ్యాపీ రిసార్ట్స్ ను వాడుకోవాలని అధినేత నిర్ణయించారు. వెంటనే రిసార్ట్స్ యాజమాన్యంతో రెండేళ్ళపాటు ఒప్పందం కుదుర్చేసుకున్నారు. అందుకే సోమవారం జరిగిన పార్టీ సమావేశం రిసార్ట్స్ లో జరిగింది. ఒప్పందం ప్రకారం మరో రెడేళ్ళ పాటు పార్టీ కార్యకలాపాలన్నీ కుడా ఇక్కడే జరుగుతాయి.

పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని మంగళగిరి సమీపంలో విజయవాడ హైవే మార్గానికి ఆనుకునే నిర్మించాలని చంద్రబాబునాయుడు నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కార్యాలయం పూర్తయ్యేవరకూ కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యామ్నాయాలను వెతికారు. అయితే, పార్టీ కార్యాలయం నిర్మాణ స్ధలానికి ఎదురుగా ఉండటం, తమ అవసరాలకు తగ్గట్లుగా సౌకర్యాలుండటం హ్యాపీ రిసార్ట్స్ కు కలిసివచ్చింది.

హ్యాపీ రిసార్ట్సులో సెమినార్‌ హాలు కాకుండా 30వరకు గదులు, రెస్టారెంట్‌ వంటి అత్యాధునిక సదుపాయాలన్నీ వున్నాయి. వందకుపైగా వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యం కుడా వుంది. దీంతో వచ్చే రెండేళ్లకు రిసార్ట్సును లీజుకు తీసుకున్నారు. ఇప్పటికే సెమినార్‌ హాలుతో పాటు కొన్ని గదులను రీమోడల్‌ చేయించారు. పార్టీ తరపున నిర్వహించే అన్నీ రకాల శిక్షణశిబిరాలతో పాటు ముఖ్య సమావేశాలన్నింటిని ఇక్కడే నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పార్టీ ముఖ్య నాయకులకు ఇక్కడ శిక్షణ శిబిరాలను నిర్వహిస్తారు.                       

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu