గుడి పూజారితో చెప్పులు మోయించిన ట్రస్టీ

By pratap reddyFirst Published Nov 21, 2018, 7:45 AM IST
Highlights

ట్రస్ట్ చైర్మన్ హనుమాన్ జయంతి రోజున ఆలయానికి వచ్చారు. ఈ సమయంలో ఆయన చెప్పులు మరిచిపోయారు. చెప్పులు తీసుకురావాలని చైర్మన్ పూజారిని ఆదేశించారు. అందుకు నిరాకరించగా తనను తిట్టారని పూజారి మారుతిరామ్ చెప్పారు.

విజయవాడ: కృష్ణా జిల్లా ఎనికెపాడు శ్రీరామచంద్ర స్వామి ఆలయానికి చెందిన పూజారి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గౌరంగాబాద్ తన చెప్పులు మోయించారు. స్వయంగా పూజారి ఆ ఆరోపణ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన పూజారి  సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది.

ట్రస్ట్ చైర్మన్ హనుమాన్ జయంతి రోజున ఆలయానికి వచ్చారు. ఈ సమయంలో ఆయన చెప్పులు మరిచిపోయారు. చెప్పులు తీసుకురావాలని చైర్మన్ పూజారిని ఆదేశించారు. అందుకు నిరాకరించగా తనను తిట్టారని పూజారి మారుతిరామ్ చెప్పారు.

ట్రస్ట్ చైర్మన్ దూషించడంతో తాను చెప్పులు మోయక తప్పలేదని ఆయన అన్నారు. తాను చెప్పుల గురించి అడిగానని, వాటిని తేవడానికి కారును పంపించానని, ఆ కారును ఆలయానికి వెళ్లడానికి పూజారి వాడుకున్నాడని చైర్మన్ అంటున్నారు. 

మారుతిరామ్ చేసిన ఆరోపణలను ఆలయం ఈవో కోటేశ్వరమ్మ ఖండించారు. మారుతిరామ్ పై ఎన్నో ఆరోపణలు ఉన్నాయని అన్నారు. 

click me!
Last Updated Nov 21, 2018, 7:45 AM IST
click me!