గురజాడ పురస్కారాన్ని చాగంటి కోటేశ్వరరావుకి ఇవ్వడాన్ని కవులు, కళాకారులు, రచయితలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గురజాడ నివాసం నుండి నిరసన ర్యాలీ నిర్వహించారు.
విజయనగరం: గురజాడ పురస్కారం వివాదస్పదంగా మారింది. ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం అందించడంపై పలువురు నిరసనకు దిగారు. ఆదివారంనాడు విజయనగరంలోని గురజాడ నివాసం నుండి కవులు, రచయితలు, కళాకారులు నిరసన ర్యాలీకి దిగారు.
ప్రతి ఏటా గురజాడ పురస్కారాన్ని అందిస్తుంటారు.ఈ ఏడాది చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం అందించడంపై కవులు, కళాకారులు,రచయితలు నిరసనకు దిగారు. గురజాడ భావ జాలానికి భిన్నమైన చాగంటి కోటేశ్వరరావుకు ఈ అవార్డును అందించడంపై వారు మండిపడుతున్నారు.చాగంటి కోటేశ్వరరావుకు తాము వ్యతిరేకం కాదని వారు చెబుతున్నారు.చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచనాలు చెబుతారు. గురజాడ భావ జాలం దానికి భిన్నంగా ఉన్న విషయాన్ని నిరసనకారులు గుర్తు చేస్తున్నారు.భిన్నమైన భావజాలం ఉన్న చాగంటి కోటేశ్వరరావుకి ఈ అవార్డు ఇవ్వడాన్ని నిరసనకారులు తప్పుబడుతున్నారు. గతంలో కూడా పలువురు సినీ రంగంలోని వారికి గురజాడ పురస్కారాలు అందించిన సమయంలో కూడా తాము వ్యతిరేకించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.ఇదే డిమాండ్ తో కవులు, కళాకారులు, రచయితలు గురజాడ ఇంటి నుండి ర్యాలీ నిర్వహించారు.
undefined