ఒంగోలులో రోడ్డు ప్రమాదం: 32 మంది అయ్యప్ప భక్తులకి గాయాలు

By narsimha lodeFirst Published Nov 27, 2022, 11:01 AM IST
Highlights

శబరిమలకు  వెళ్తున్న  అయ్యప్ప భక్తుల  బస్సు  ఒంగోలు  సమీపంలో  ప్రమాదానికి  గురైంది. ఈ ప్రమాదంలో  32  మంది  అయ్యప్పభక్తులు  గాయపడ్డారు. గాయపడినవారిని  ఆసుపత్రిలో  చేర్పించారు. 

ఒంగోలు: ఉమ్మడి  ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో  ఆదివారంనాడు  తెల్లవారుజామున  జరిగిన  రోడ్డు ప్రమాదంలో  32  మంది  అయ్యప్ప  భక్తులు  గాయపడ్డారు. అనకాపల్లి  జిల్లా  డీఎల్ పురం గ్రామానికి చెందిన  అయ్యప్పభక్తులు  ప్రైవేట్  టూరిస్ట్ బస్సులో నిన్న  శబరిమలకు  బయలుదేరారు.  ఆదివారం నాడు  తెల్లవారుజామున ప్రైవేట్ బస్సు  ఒంగోలుకు  సమీపంలో  టిప్పర్ ను ఢీకొట్టింది.  దీంతో  ప్రైవేట్  బస్సు  ముందు భాగం  నుజ్జునుజ్జైంది. ఈ  విషయం  తెలిసిన  వెంటనే పోలీసులు  రంగంలోకి దిగి  గాయపడిన  అయ్యప్ప భక్తులను  ఆసుపత్రికి  తరలించారు. 43  మంది  ఈ  బస్సులో  ప్రయాణీస్తున్నారు. ఈ ప్రమాదంలో  32  మంది  గాయపడ్డారు. ప్రైవేట్  బస్సు  డ్రైవర్ నిద్రమత్తులో  టిప్పర్ ను ఢీకొట్టాడని  అయ్యప్ప భక్తులు చెబుతున్నారు.

రెండు  తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని పలు  రాష్ట్రాల్లో  రోజూ  ఏదో  ఒక  చోట రోడ్డు ప్రమాదం  జరుగుతున్న  ఘటనలు  నమోదౌతున్నాయి. ఉత్తర్  ప్రదేశ్ రాష్ట్రంలోని  లఖింపూర్ ఖేరీలో  జరిగిన  రోడ్డు ప్రమాదంలో  ఐదుగురు  మృతి  చెందారు.ఈ ఘటన ఈ  నెల 22న  జరిగింది.  కూలీలతో  వెళ్తున్న  కారు పాలియా  పోలీస్ స్టేషన్  పరిధిలలోని  రైల్వే క్రాసింగ్  సమీపంలో  అదుపు తప్పి  లోయలో  పడింది. యూపీలోని  ఆజంఘడ్  లో  ఈ నెల  21న  జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఇద్దరు  మృతి చెందారు.  మరో ఆరుగురికి గాయపడ్డారు.ఓ ప్రైవేట్  బస్సు, బైక్  ఢీకొనడంతో  ఈ ప్రమాదం జరిగింది.

తెలంగాణలోని వనపర్తి  జిల్లా  కొత్తకోట మండలం  బొమ్మలపల్లి  వద్ద  ఈ నెల  21న  జరిగిన  రోడ్డు ప్రమాదంలో  ముగ్గురు మృతి  చెందారు.   మరో  14  మందికి గాయాలయ్యాయి. హైద్రాబాద్  నుండి బెంగుళూరు  వెళ్తున్న  ఆర్టీసీ బస్సు  ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో  ఈ ప్రమాదం  జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో  ఈ నెల 20న జరిగిన  రోడ్డు ప్రమాదంలో  ముగురు  మరణించారు.జిల్లాలోని  ముద్దనూరు బైపాస్ రోడ్డులో  ఆటో,  లారీ ఢీకొనడంతో  ముగ్గురు చనిపోయారు. మృతులను ఎర్రగుంట్ల  మండలం  పొట్లదుర్తివాసులుగా  గుర్తించారు. 

also read:ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న రోడ్డు ప్రమాద మరణాలు.
ఉత్తరాఖండ్  లో జరిగిన  రోడ్డు ప్రమాదంలో పది మంది  చనిపోయారు. చమోలి  వద్ద బస్సు లోయలో  పడిపోవడంతో  ఈ  ప్రమాదం  జరిగింది.ఈ ఘటన ఈ నెల  18న జరిగింది. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం  మల్లేపల్లిలో ట్రాలీ, టాటా  మ్యాజిక్  వాహనం  ఢీకొని  నలుగురు మృతి  చెందారు. తాడేపల్లిగూడెం  నుండి వైజాగ్ కు వెళ్తున్న  సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 

click me!