గుంటూరు  పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు 2024  

Published : Mar 05, 2024, 06:27 PM ISTUpdated : Mar 05, 2024, 06:38 PM IST
గుంటూరు  పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు 2024  

సారాంశం

గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా కీలకంగా మారింది. రాజధాని అమరావతిపై వివాదం కొనసాగుతుండటంతో గుంటూరు ప్రజల తీర్పు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చాలా కీలకం అయ్యింది. గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మద్దాల గిరిధర్ గెలిచారు... అయితే ఆయన ప్రస్తుతం వైసిపిలో కొనసాగుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న ఆయనను కాదని మంత్రి విడదల రజనిని ఇక్కడ పోటీలో నిలిపారు వైసిపి అధినేత వైఎస్ జగన్. దీంతో గుంటూరు తూర్పు పోరు రసవత్తంగా మారింది. 

గుంటూరు పశ్చిమ అసెంబ్లీ ఎన్నికలు 2024 :

వైసిపి అభ్యర్ధి, వివరాలు :

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి మంత్రి విడదల రజని బరిలోకి దిగుతున్నారు. గత రెండు పర్యాయాలు ఇక్కడ టిడిపి గెలుస్తూ వస్తోంది. దీంతో ఇక్కడ గట్టి అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించిన వైసిపి రజనిని బరిలోకి దింపుతోంది. 

 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరిపేట నుండి గెలిచారు రజని. బిసి సామాజికవర్గానికి చెందిన ఆమె ప్రస్తుతం జగన్ మంత్రివర్గంలో కీలకమైన వైద్యారోగ్య శాఖ నిర్వహిస్తున్నారు. ఆమెపై నమ్మకంతో సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కనబెట్టి మరీ గుంటూరు పశ్చిమ టికెట్ కేటాయించి బరిలో దింపింది వైసిపి. మంత్రి రజని బిసి కాగా భర్త కాపు సామాజికవర్గానికి చెందినవారు... దీంతో బిసి, కాపు ఈక్వేషన్ కలిసి వస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి రజని పోటీ చేస్తున్నారు.  

టిడిపి అభ్యర్థి ఎవరు? 

గుంటూరు పశ్చిమ నియోకవర్గ టిడిపి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఈ సీటు కోసం చాలామంది పోటీ పడుతుండగా మూడు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కాపు నేత డేగల ప్రభాకర్,  బిసి నేతలు తాళ్ల వెంకటేశ్ యాదవ్,  గల్లా మాధవి టికెట్ ఆశిస్తున్నారు.  

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎన్నికలు : 

గుంటూరు పశ్చిమ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019 : 

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం పోలయిన ఓట్లు 1,74,645

టిడిపి ‌- మద్దాల గిరి - 71,864 (41 శాతం) (గెలుపు) 

వైసిపి - చంద్రగిరి ఏసురత్నం - 67,575 (38 శాతం) (ఓటమి)

జనసేన -తోట చంద్రశేఖర్ - 27,289 (15 శాతం) (మూడో స్ధానం) 


గుంటూరు పశ్చిమ అసెంబ్లీ ఎన్నికలు 2014 : 

ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుతర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 1,71,377 ఓట్లు పోలయ్యాయి.

టిడిపి - మోదుగుల వేణుగోపాల్ రెడ్డి - 78,837 ఓట్లు(46 శాతం) గెలుపు
 
వైసిపి - లేళ్ల అప్పిరెడ్డి ‌- 60,924 (35 శాతం) ఓటమి 


గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎన్నికలు 2009 : 

నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మొదటిసారి  2009 ఎన్నికలు జరిగాయి. ఇందులో 1,29,457 ఓట్లు పోలయ్యాయి. 

కాంగ్రెస్ - కన్నా లక్ష్మీనారాయణ  - 44,676 ఓట్లు (34 శాతం) గెలుపు 

టిడిపి - చుక్కపల్లి రమేష్ - 41,375 ఓట్లు (32 శాతం) ఓటమి  

ప్రజారాజ్యం ‌-  తులసి రామచంద్ర ప్రభు ‌- 34,004 ఓట్లు (26 శాతం) మూడో స్థానం 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?