కేంద్ర‌హోంమంత్రికి రఘురామ ఫిర్యాదు: గుంటూరు అర్బన్ ఎస్పీ బదిలీ

By narsimha lode  |  First Published Jun 2, 2021, 11:37 AM IST

గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. అమ్మిరెడ్డి ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు.ఆయనను మంగళగిరి పోలీస్ హెడ్‌క్వార్టర్స్ లో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం నాడు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. 


అమరావతి: గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. అమ్మిరెడ్డి ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు.ఆయనను మంగళగిరి పోలీస్ హెడ్‌క్వార్టర్స్ లో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం నాడు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. 

also read:నాపై థర్డ్ డిగ్రీ మానవ హక్కుల ఉల్లంఘనే: ఎన్‌హెచ్‌ఆర్‌సి ఛైర్మన్ కు రఘురామ పిర్యాదు

Latest Videos

అమ్మిరెడ్డి స్థానంలో ఆరిఫ్ హాఫీజ్ ను గుంటూరు అర్బన్ ఎస్పీగా నియమించారు.  త్వరలో ఏపీ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగే అవకాశం ఉంది.  ఎస్పీ అమ్మిరెడ్డిపై కేంద్ర రక్షణశాఖ మంత్రికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశాడు. సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రి రిజిస్ట్రార్ కెపి రెడ్డి, టీటీడీ జీఈఓ ధర్మారెడ్డి,  గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి కుట్ర పన్నారని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆధారాలను కూడ ఆయన కేంద్ర హోంశాఖ మంత్రికి సమర్పించారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కు  గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిపై ఫిర్యాదు చేసిన  రెండు రోజుల్లోనే  ఆయన బదిలీ చేయడం చర్చనీయాశంగా మారింది. 

click me!