విజయవాడలో రోడ్డు పక్క వివాహిత మృతదేహం.. గుంటూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిదే....

By SumaBala BukkaFirst Published Jan 19, 2022, 9:50 AM IST
Highlights

మృతదేహం రోడ్డు పక్కన పడి ఉన్న తీరు చూసిన పోలీసులు మొదట ఇది రోడ్డు ప్రమాదంగా భావించారు. గుంటూరులో అదృశ్యమైన ఆమె విజయవాడలో మృతి చెంది పడి ఉండడంపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో మరణిస్తే శరీరంపై గాయాలతో పాటు.. రక్తం మరకలు ఉండాలి.. మృతురాలి శరీరంపై అలాంటివి ఏమీ లేవు.  ఇంటి నుంచి కనిపించకుండా వెళ్లిపోయిన తనూజా ఆరు గంటల్లోనే శవమై తేలింది. ఈ ఆరు గంటల్లో ఏం జరిగింది? అనేది మిస్టరీగా మారింది. సిసి కెమెరాల వైఫల్యంతో కేసు విచారణలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది.


గుంటూరు :  విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన పడి ఉన్న మహిళ మృతదేహం గుంటూరుకు చెందిన Software employee తనుజ(30)దిగా పోలీసులు గుర్తించారు. ఆమె మృతిపై గుంటూరు, విజయవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు ఏటి అగ్రహారానికి చెందిన తనూజ Software Engineer.  2018లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మణికంఠతో వివాహం అయింది. వీరికి ఒక బాబు. భార్యాభర్తలిద్దరూ Bangaloreలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు. corona virus నేపథ్యంలో కొంత కాలంగా ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నారు.

ఈ క్రమంలో ఆదివారం  ఇంటి నుంచి వెళ్ళిందని..  ఆమె కోసం వెతికినా ఆచూకీ లేదంటూ తల్లిదండ్రులు సోమవారం గుంటూరులోని నగరపాలెంపోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో Vijayawadaలోని శిఖామణి సెంటర్ సమీపంలో  రోడ్డు పక్కన మహిళ మృతదేహాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు. ఆమె వివరాలు తెలియకపోవడంతో Unidentified womanగా కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న గుంటూరు పోలీసులు తనూజకు సంబంధించిన ఫోటోలతో ఆ మృతదేహాన్ని పోల్చి అది ఆమె dead bodyగానే నిర్ధారణకు వచ్చారు. 

మృతదేహం రోడ్డు పక్కన పడి ఉన్న తీరు చూసిన పోలీసులు మొదట ఇది road accidentగా భావించారు. గుంటూరులో అదృశ్యమైన ఆమె విజయవాడలో మృతి చెంది పడి ఉండడంపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో మరణిస్తే శరీరంపై గాయాలతో పాటు.. రక్తం మరకలు ఉండాలి.. మృతురాలి శరీరంపై అలాంటివి ఏమీ లేవు.  ఇంటి నుంచి కనిపించకుండా వెళ్లిపోయిన తనూజా ఆరు గంటల్లోనే శవమై తేలింది. ఈ ఆరు గంటల్లో ఏం జరిగింది? అనేది మిస్టరీగా మారింది. సిసి కెమెరాల వైఫల్యంతో కేసు విచారణలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది.

తనూజకు విజయవాడలో బంధువులు ఉన్నారని అక్కడికి వచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె మృతిపై రెండు నగరాల పోలీసులు సంయుక్తంగా విచారణ చేస్తున్నామని, కేసు దర్యాప్తు దశలో ఉన్నదని నగరపాలెం సీఐ హైమారావు తెలిపారు.

ఇదిలా ఉండగా, సోమవారం విజయవాడలో గుర్తుతెలియని మహిళ అనుమానాస్పద రీతిలో మృత్యువాతపడిన ఘటన కలకలం రేపింది. రోడ్డుపై మహిళ మృతదేహం పడివుండటంతో రోడ్డు ప్రమాదంలో చనిపోయిందా? లేక ఏదయినా అఘాయిత్యానికి పాల్పడి మృతదేహాన్ని తీసుకువచ్చి రోడ్డుపై పడేసారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

వివరాల్లోకి వెళితే... విజయవాడలోని శిఖామణి సెంటర్ లో ఓ 30ఏళ్ల మహిళ మృతదేహం రోడ్డుపై పడివుండటాన్ని స్థానికులు గుర్తించారు. వారు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలను సేకరించారు. అనంతరం మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

తెల్లవారుజామున వివాహితను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. సదరు మహిళ నిజంగానే ప్రమాదవశాత్తు మరణించిందా లేక అత్యాచారం చేసి హతమార్చి యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేసారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తలకు బలమైన గాయం అవడంతో మహిళ మృతిచెందినట్లు ప్రాథమికంగా నిర్దారణ అయ్యింది. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే మహిళ ఎలా మృతిచెందిందో తేలనుంది. 

click me!