టెక్కీ మనోజ్ఞమృతి కేసు: పోలీసుల అదుపులో భర్త, అతని పేరేంట్స్

Published : Aug 30, 2020, 12:41 PM ISTUpdated : Sep 02, 2020, 12:06 PM IST
టెక్కీ మనోజ్ఞమృతి కేసు: పోలీసుల అదుపులో భర్త, అతని పేరేంట్స్

సారాంశం

టెక్కీ మనోజ్ఞ, ఆమె కూతురు అనుమానాస్పద మరణంపై  ఆమె భర్త కళ్యాణ్ చక్రవర్తి అత్త మామలు శ్రీమన్నారాయణ, కామేశ్వరిని ఆదివారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. తన కూతురు, మనమరాలు మృతికి భర్త, అత్తామామలే కారణమని మనోజ్ఞ, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

గుంటూరు: టెక్కీ మనోజ్ఞ, ఆమె కూతురు అనుమానాస్పద మరణంపై  ఆమె భర్త కళ్యాణ్ చక్రవర్తి అత్త మామలు శ్రీమన్నారాయణ, కామేశ్వరిని ఆదివారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. తన కూతురు, మనమరాలు మృతికి భర్త, అత్తామామలే కారణమని మనోజ్ఞ, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

తాను నివాసం ఉంటున్న టెక్కీ మనోజ్ఞ, ఆమె కూతురు తులసి అనుమానాస్పదస్థితిలో మరణించారు. తన భార్య మరణానికి కారణాలు తెలియవని భర్త కళ్యాణ్ చక్రవర్తి చెబుతున్నారు. తాను ఆమెను ఇష్టపడే పెళ్లి చేసుకొన్నట్టుగా ఆయన చెప్పారు. 

భర్తతో పాటు ఆయన కుటుంబసభ్యులు వేధింపులకు గురిచేసేవారని ఈ విషయమై తమ కూతురు తమకు ఫోన్ చేసి చెప్పిందని టెక్కీ మనోజ్ఞ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. టెక్కీకి కరోనా ఉన్నట్టుగా రిపోర్టులు చెబుతున్నాయి. ఆమె కూతురు తులసి రిపోర్టు కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.

మరో వైపు కళ్యాణ చక్రవర్తితో పాటు ఆయన తల్లీదండ్రులపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసులు. రెవిన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో మనోజ్ఞ, ఆమె కూతురు మృతదేహలకు పోస్టుమార్టం నిర్వహించారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్