నెల్లూరు జిల్లాలో ఆలయ నిర్మాణం: కేసీఆర్ దంపతుల విరాళం

By narsimha lodeFirst Published Aug 30, 2020, 11:31 AM IST
Highlights

నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం స్వర్ణముఖి దివ్య క్షేత్రలో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు విరాళమిచ్చారు.


నెల్లూరు: నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం స్వర్ణముఖి దివ్య క్షేత్రలో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు విరాళమిచ్చారు.

ఆలయం ముందు భాగంలో మహారాజ గోపురం, తూర్పు మాడవీధి నిర్మాణానికి కేసీఆర్ దంపతులు విరాళమిచ్చారు. ఈ ఆలయంలో  శనివారం నాడు శ్రీవారి విగ్రహా ప్రతిష్టపాన కార్యక్రమాన్ని పురస్కరించుకొని కుంభాభిషేకంతో పాటు పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. 

తమ గ్రామంలో ఆలయ నిర్మానానికి కేసీఆర్ దంపతులు విరాళం ఇవ్వడంతో స్థానికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి విరాళమిచ్చిన కేసీఆర్ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. అయితే కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వారు రద్దు చేసుకొన్నట్టుగా ఆలయ వర్గాలు తెలిపాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తిరుపతితో పాటు విజయవాడ కనకదుర్గ అమ్వవారికి మొక్కులు తీరుస్తానని కసీఆర్ మొక్కుకొన్నారు. గతంలోనే తిరుపతి, విజయవాడలో అమ్మవారికి కేసీఆర్ కుటుంబసభ్యులు మొక్కులు తీర్చుకొన్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకొంది. 
 

click me!