కులం చూసేకదా.. పవన్ కి బీజేపీ వత్తాసు పలికింది.. బొత్స

Published : Nov 15, 2018, 03:25 PM IST
కులం చూసేకదా.. పవన్ కి బీజేపీ వత్తాసు పలికింది.. బొత్స

సారాంశం

ఇప్పటికీ పవన్ అధికార టీడీపీ పార్టీ డైరెక్షన్ లోనే నడుస్తున్నారని  బొత్స ఆరోపించారు. 

కులాలతో తనకు సంబంధం లేదంటూనే జనసేన అధినేత పవన్ కళ్యాన్ కులాల గురిచి మాట్లాడుతున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు.  తనకు ఏ కులాన్ని ఆపాదించవద్దని పవన్ అంటున్నారని.. ఆయన ఓ కులానికి చెందినవాడనే కదా.. గత ఎన్నికల్లో ఆయనకు బీజేపీ వత్తాసు పలికింది అని బొత్స కామెంట్స్ చేశారు.

గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన బొత్స  సత్యనారాయణ.. పవన్ పై విమర్శల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ అర్థం లేకుండా మాట్లాడాతారని మండిపడ్డారు. వైఎస్ఆర్ ని తాను ఎదురించానని గొప్పలు చెప్పుకునే పవన్.. అసలు అప్పుడు రాజకీయాల్లో ఉన్నారా అని ప్రశ్నించారు.

చంద్రబాబులాగానే.. పవన్ కూడా అర్థం లేకుండా మాట్లాడతారన్నారు. ఖాళీ దొరికినప్పుడు ప్రతిపక్ష నేతపై విమర్శలు చేయడం కాదని.. ప్రజల కోసం పోరాడాలన్నారు. ఇప్పటికీ పవన్ అధికార టీడీపీ పార్టీ డైరెక్షన్ లోనే నడుస్తున్నారని ఆరోపించారు. 

PREV
click me!

Recommended Stories

YS Jagan Pressmeet: 2026లో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవుతుందని అప్పుడే చెప్పా | Asianet News Telugu
YS Jagan Comments: నాకు మంచి పేరు వస్తుందని ప్రాజెక్టులన్నీ ఆపేశారు | Asianet News Telugu