గుంటూరులో దారుణం: బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య

By narsimha lode  |  First Published Aug 15, 2021, 1:11 PM IST


  గుంటూరు జిల్లా పెదకాకాని రోడ్డులో బీటెక్ థర్డ్ ఈయర్ విద్యార్థిని దారుణహత్యకు గురైంది. హత్యకు గురైన యువతి రమ్య గా గుర్తించారు. టిఫిన్ తీసుకొచ్చే సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకొంది.


గుంటూరు: గుంటూరు జిల్లా పెదకాకాని రోడ్డులో బీటెక్ థర్డ్ ఈయర్ విద్యార్ధిని  రమ్య హత్యకు గురైంది. రమ్యను  గుర్తుతెలియని దుండగుడు కత్తితో పొడిచి చంపాడు.మెడకింది భాగంలో  పొట్టపై విచక్షణరహితంగా కత్తితో పొడిచాడు.  ఈ ఘటనలో యువతికి తీవ్రంగా రక్తస్రావమై అక్కడికక్కడే మరణించింది. యువతిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు.

పెదకాకాని రోడ్డులోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద టిఫిన్ తీసుకొచ్చేందుకు గాను  రమ్య వచ్చింది. ఆ సమయంలో ఓ యువకుడు టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చి ఆమెను బైక్ పై కూర్చోవాలని కోరాడు.అయితే యువతి నిరాకరించింది.దీంతో ఆ యువకుడు తన వెంట తెచ్చుకొన్న కత్తితో ఆ యువతిని కత్తితో పొడిచాడు. ఈ ఘటన ఇంటికి సమీపంలో చోటు చేసుకొంది.

Latest Videos

ఈ విషయం తెలుసుకొన్న వెంటనే అర్బన్ ఎస్పీ సంఘటన స్థలానికి చేరుకొన్నారు. యువతి సెల్‌ఫోన్ ను పోలీసులు  స్వాధీనం చేసుకొన్నారు. ఇద్దరు యువకులపై పోలీసులు అనుమానిస్తున్నారు.

రమ్య స్నేహితులను కూడ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రమ్య హత్యకు గల కారణాలకు ప్రేమ వ్యవహరం కారణమా, ఇతరత్రా కారణాలున్నాయా అనే విషఁయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
 

click me!