ఏపీలోగ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలకు తాత్కాలిక బ్రేక్.. కారణమిదే..!

By Sumanth KanukulaFirst Published Dec 1, 2022, 2:43 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లోని పలు గ్రామాల్లో ఆధార్ సేవలకు అంతరాయం ఏర్పడింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని పలు గ్రామాల్లో ఆధార్ సేవలకు అంతరాయం ఏర్పడింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. సాఫ్ట్ వేర్ సంబంధిత సాంకేతిక సమస్య కారణంగా ఆధార్ సేవలను నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలను పునరుద్దరించడానికి సమయం పడుతుందని అంటున్నారు. అయితే సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ కోసం ఈ సేవలను నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. 

ఇక, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం పలు గ్రామ సచివాలయాల్లో ఆధార్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. కొత్తగా ఆధార్ కార్డు నమోదు, ఇప్పటికే ఉన్న ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్, ఆధార్ కార్డులో చిరునామా  మార్పు వంటి.. తదితర సేవలను గ్రామ సచివాలయాల్లోనే అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 

click me!