
రోడ్డుపై అడ్డంగా నిలబడి వచ్చి పోయే వాహనాలను ఆపి డబ్బులు గుంజుతోన్న గుజరాత్ లేడీ గ్యాంగ్‌ను (gujarat lady gang) గుంటూరు పోలీసులు (guntur police) అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ నుంచి గుజరాత్ వచ్చిన 19 మంది యువతులు నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై కాపు కాస్తున్నారు. బైకులపై వెళ్లే యువకులను టార్గెట్ చేసుకుంటున్నారు. బైక్‌లకు అడ్డంగా వెళ్లి వారిని ఆపి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వని వారిని అసభ్యకర పదజాలంతో తిట్టడమే కాకుండా.. దాడులకు తెగబడుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసి వీరిని అదుపులోకి తీసుకున్నారు.