షాక్:పెళ్లికి గంటల ముందే వరుడు జంప్

By narsimha lodeFirst Published Dec 28, 2018, 3:49 PM IST
Highlights

మరికొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి  ఉండగా  స్వచ్ఛమైన బంగారం కట్నం రూపంలో ఇవ్వలేదనే నెపంతో పెళ్లి కొడుకు  పెళ్లి మండపం నుండి పారిపోయాడు. 


అనంతపురం:మరికొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి  ఉండగా  స్వచ్ఛమైన బంగారం కట్నం రూపంలో ఇవ్వలేదనే నెపంతో పెళ్లి కొడుకు  పెళ్లి మండపం నుండి పారిపోయాడు. పెళ్లి కొడుకు కోసం పారిపోవడంతో పెళ్లి  నిలిచిపోయింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకొంది.

అనంతపురం జిల్లా తనకల్లు మండలం బాల సముద్రం పంచాయితీలోని టీ సదుంకు చెందిన మహబూబ్‌ భాషా కొడుకు మహమ్మద్ రఫిక్ కదిరి మున్సిఫల్ పరిధిలోని నిజాంవలి కాలనీకి చెందిన అమ్మాయితో వివాహం కుదిరింది. గురువారం ఉదయం 11:30 నిమిషాలకు కదిరిలోని టైటానిక్ ఫంక్షన్ హాల్ లో పెళ్లి జరపాలని నిర్ణయం తీసుకొన్నారు.

ముహుర్తం సమయానికి వరుడు కన్పించకుండా పోయాడు. దీంతో వధువు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పెళ్లికి ముందు రోజునే  కట్నం రూపంలో స్వచ్ఛమైన బంగారం ఇవ్వాలని అబ్బాయి బందువులు డిమాండ్ చేశారు.

వధువు తరపు వాళ్లు ఇచ్చిన 10 తులాల బంగారం స్వఛ్చమైంది కాదని వరుడు తరపు బంధువులు గొడవకు దిగారు. పెద్ద మనుషులు సర్ధిచెప్పడంతో సమస్య సద్దుమణిగిందని  భావించారు.  కానీ, పెళ్లి సమయానికి  వరుడు కన్పించకుండా పోయారు.

తమ కంటే రూ.50 వేలు ఎక్కువ కట్నం ఇస్తామని చెప్పడంతో  ఆ సంబంధం చేసుకొనేందుకు వెళ్లాడని వధువు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సీఐ గోరంట్ల మాధవ్ కు ఫిర్యాదు చేశారు.
 

click me!