ఏపీ ఎన్నికలు..పొత్తుపై క్లారిటీ ఇచ్చిన నాదెండ్ల

Published : Dec 28, 2018, 02:55 PM IST
ఏపీ ఎన్నికలు..పొత్తుపై క్లారిటీ ఇచ్చిన నాదెండ్ల

సారాంశం

ఎన్నికల్లో జనసేన.. వైసీపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కాగా.. ఈ ప్రచారంపై జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు, అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు.  

ఏపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన.. వైసీపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కాగా.. ఈ ప్రచారంపై జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు, అసెంబ్లీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు.

జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనతరంగ్ కార్యక్రమంలో భాగంగా నాదెండ్ల పలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖలో పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో జనసేన ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. ఒంటరిగానే పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు.

ఏ పార్టీతో తాము కలిసి పనిచేయమన్నారు. టీడీపీ, వైసీపీలు స్వార్థ ప్రయోజనాల కోసం జనసేనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.70వేల కోట్ల రుపాయల నిధులు రావాల్సి ఉందని, ఇందుకోసం అందరం కలిసి పోరాడదామని పవన్ పిలుపునిచ్చారని నాదెండ్ల చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!