ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి (ap govt) ఉద్యోగుల నుంచి ఊహించని షాక్ తగిలింది. పీఆర్సీ నివేదిక (prc report) కోసం ఏపీ ఉద్యోగ సంఘాలు (ap govt employees) పట్టుబడుతున్నాయి. 11వ పీఆర్సీని రెండేళ్లుగా నిర్లక్ష్యం చేయడం బాధాకరమని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి (ap govt) ఉద్యోగుల నుంచి ఊహించని షాక్ తగిలింది. పీఆర్సీ నివేదిక (prc report) కోసం ఏపీ ఉద్యోగ సంఘాలు (ap govt employees) పట్టుబడుతున్నాయి. 11వ పీఆర్సీని రెండేళ్లుగా నిర్లక్ష్యం చేయడం బాధాకరమని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పీఆర్సీ నివేదిక కోసం ఉద్యోగులంతా ఎదురుచూస్తున్నారని ఉద్యోగ నేతలు చెబుతున్నారు. పీఆర్సీ నివేదిక విడుదల చేసే దాకా సెక్రటేరియట్ (ap secretariat) నుంచి ఇళ్లకు వెళ్లేది లేదని.. ఉద్యోగ నేతలు తేల్చిచెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే రేపటి నుంచి కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ నేతలు హెచ్చరించారు.
అంతకుముందు పీఆర్సీ నివేదిక విడుదల చేయాలని కోరుతూ బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ap cs) సమీర్ శర్మను (sameer sharma) ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాస్‌లు కలిశారు. ఈ సందర్భంగా పీఆర్సీ నివేదిక బహిర్గతం చేసేంత వరకు సచివాలయం నుంచి కదలబోమని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చిచెప్పారు. అప్పటి నుంచి సచివాలయం ప్రాంగణంలో బైఠాయించిన ఉద్యోగ నేతలు నిరసన తెలుపుతున్నారు.
undefined
సీఎస్ ప్రకటన కోసం కొన్ని గంటలుగా నిరీక్షిస్తున్నామని.. తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని వారు మండిపడ్డారు. పీఆర్‌సీ నివేదికను సీల్డ్ కవర్‌లో పెట్టడం వింతగా ఉందని.. నివేదికకే ఇబ్బంది పెడితే ఇక పీఆర్‌సీ ఎలా ఉంటుందోనంటూ వారు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పీఆర్సీ విషయంగా ప్రభుత్వ అనుమతి కోసం సీఎస్ సమీర్ శర్మ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్‌తో (ys jagan mohan reddy) చర్చిస్తున్నారు. సీఎంతో భేటీ తర్వాత నివేదిక వెల్లడిస్తారని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. దీనిపై మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) స్పందిస్తూ.. పీఆర్‌సీ ప్రక్రియ ప్రారంభమైందని వ్యాఖ్యానించారు.