సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఓటరుకు ఎడమ చెయ్యి చూపుడు వేలిపైనా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటరు ఎడమ చెయ్యి Little fingerమీదా ink mark వేయాలని పేర్కొంది.
అమరావతి : ఓటు హక్కు వినియోగించుకున్న voterకు సాధారణంగా ఎడమ చెయ్యి చూపుడు వేలి మీద సిరా గుర్తు పెడుతుంటారు. కానీ, ఈ నెల 16న జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసే ఓటరుకు ఎడమ చేతి చిటికెన వేలిపై సిరా గుర్తు వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు.
పలుచోట్ల 14న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు.. 16న పలుచోట్ల MPTC, ZPTC elections జరుగుతున్నాయి. ఒకే గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యుడు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక జరిగే అవకాశం ఉండటంతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.
సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఓటరుకు ఎడమ చెయ్యి చూపుడు వేలిపైనా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటరు ఎడమ చెయ్యి Little fingerమీదా ink mark వేయాలని పేర్కొంది.
ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా MLC election schedule విడుదలయ్యింది. నవంబర్ 9, మంగళవారం 11 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. అనంతపురం-1, కృష్ణా-2, తూర్పు గోదావరి -1, గుంటూరు-2, విజయనగరం-1, విశాఖపట్నం-2, ప్రకాశం-1 స్థానాలకు షెడ్యూల్ ప్రకటించారు.
నవంబర్ 16న నోటిఫికేషన్, డిసెంబర్ 10న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది. telangana స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక స్థానం.. కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి నుంచి రెండు స్థానాలకు మంగళవారం షెడ్యూల్ ను ప్రకటించారు.
నవంబర్ 16న నోటిఫికేషన్, నవంబర్ 23న నామినేషన్ల స్వీకరణకు చివరితేదీ, నవబంర్ 24న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 26న ఉపసంహరణకు చివరి తేదీ, డిసెంబర్ 10న పోలింగ్, డిసెంబర్ 14న counting జరగనుంది.
పీఆర్సీ రిపోర్ట్ ఇస్తారా, ఇవ్వరా.. లేకుంటే: ఏపీ సర్కార్‌కు ఉద్యోగ సంఘాల అల్టీమేటం
తెలంగాణ రాష్ట్రంలోని ఆకుల లలిత, మహ్మద్ ఫరీదుద్దీన్, గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరిల ఎమ్మెల్సీ పదవీకాలం ఈ ఏడాది జూన్ 3వ తేదీన ముగిసింది.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.చిన్న గోవింద్ రెడ్డి, మహ్మద్ అహ్మద్ షరీఫ్, సోము వీర్రాజుల పదవీకాలం ఈ ఏడాది మే 31న ముగిసింది.
తెలంగాణలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలు Trsకే దక్కుతాయి. అయితే ఈ ఆరు స్థానాల కోసం ఆశావాహుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తైన వారిలో ఎందరికీ తిరిగి రెన్యూవల్ చేస్తారనే చర్చ టీఆర్ఎస్‌లో సాగుతుంది. శాసనమండలి ఛైర్మెన్ గా పనిచేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిలకు మరోసారి ఎమ్మెల్సీ పదవులను రెన్యువల్ చేస్తారా లేదా అనే చర్చ నెలకొంది. ఇటీవల వరంగల్ జిల్లా పర్యటనకు కేసీఆర్ వెళ్లిన సమయంలో కడియం శ్రీహరి ఇంట్లోనే సీఎం కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు.