
బాపట్ల జిల్లాలో (bapatla district) దారుణం జరిగింది. వేమూరు మండలం చావలి (chavali) గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ (grama volunteer) దొప్పలపూడి శారద హత్యకు గురయ్యారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అదే గ్రామానికి పద్మారావు అనే వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం (extra marital affairs) వుంది. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన పద్మారావు శారదను పొడిచి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.