
మన తెలుగు స్టార్లు స్వప్రయోజనం లేనిదే ఏ పనీ చేయరు. మొన్న తమిళనాడులో జల్లికట్టుకు మహేష్ బాబు మద్దతుగా ట్వీట్ చేసారు. అదే సమయంలో రాష్ట్రంలోని సమస్యలపై మాత్రం ఎన్నడూ స్పందించలేదు. నిజానికి జల్లికట్టు అన్నది పూర్తిగా తమిళనాడుకు మాత్రమే సంబంధించిన వ్యవహారం. దాంతో మన రాష్ట్రానికి ఎటువంటి సంబంధమూ లేదు. ప్రత్యేకహోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసినా కనీసం ప్రశ్నించాలని కూడా మన స్టార్లకు అనిపించలేదు.
అటువంటిది జల్లికట్టుకు మద్దతుగా మహేష్ పనిగట్టుకుని మరీ ట్వీట్లు చేసారు? అదే విషయం అప్పట్లో అనేకమందిని వేధించింది. దానికి సమాధానం ఇపుడు తెలిసింది. తాను నటిస్తున్న సినిమాలో జల్లికట్టు సన్నివేశాలు కూడా ఉన్నాయట. సదరు సినిమాకు దర్శకుడు తమిళతంబి మురుగదాస్. సామాజిక అంశంగా దేశంలోనే సంచలనం సృష్టించిన జల్లికట్టు అంశాన్ని తన సినిమాలో దర్శకుడు జొప్పిస్తున్నాడట. అందుకనే ముందుజాగ్రత్తగా మహేష్ తో జల్లికట్టుకు మద్దతుగా ట్వీట్లు ఇప్పించారట మురుగదాస్. ముందుజాగ్రత్త ఎందుకంటే, బిజినెస్సే పరమావధి కదా మన స్టార్లకు. ఇపుడర్ధమైందా మన స్టార్లు ఎంతటి స్వార్ధపరులో.