నటుడు పృథ్వీ కి జగన్ కీలక పదవి

Published : Jul 20, 2019, 08:08 AM IST
నటుడు పృథ్వీ కి జగన్ కీలక పదవి

సారాంశం

శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ గా పృథ్వీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పృథ్వీని ఎస్వీబీసీ ఛైర్మన్ గా తిరుమల తిరుపతి దేవస్థానం నియమించింది. 

సినీ నటుడు పృథ్వీరాజ్ కి ఏపీ ప్రభుత్వం కీలక పదవి కేటాయించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నటుడు పృథ్వీ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో ఆయన చురుకుగా పాల్గొంటున్నారు. కాగా... తాజాగా పృథ్వీకి జగన్ కీలక పదవికి అప్పగించారు.

శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ గా పృథ్వీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పృథ్వీని ఎస్వీబీసీ ఛైర్మన్ గా తిరుమల తిరుపతి దేవస్థానం నియమించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన ఛానల్ బోర్డు సమావేశంలో ఈ మేరకు ఉత్వర్వులు జారీ చేసింది.

పృథ్వీ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జన్మించారు. 1993లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ కథానాయకుడుగా తెరకెక్కిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?