ఏపీలో ఏ పథకం ఎప్పుడంటే... తేదీతో సహా ప్రకటించిన జగన్ సర్కార్

Arun Kumar P   | Asianet News
Published : May 19, 2020, 09:14 PM ISTUpdated : May 19, 2020, 09:23 PM IST
ఏపీలో ఏ పథకం ఎప్పుడంటే... తేదీతో సహా ప్రకటించిన జగన్ సర్కార్

సారాంశం

ప్రభుత్వ పధకాల అమలుపై ప్రజల్లో ఎలాంటి కన్ఫ్యూజన్  లేకుండా వుండేందుకు చర్యలు తీసుకుంది వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసిపి సర్కార్. 

అమరావతి: 2020 మే నెల నుండి 2021 మార్చి వరకు చేపట్టనున్న కార్యక్రమాల వివరాలను తేదీలతో సహా ప్రకటించింది వైసిపి ప్రభుత్వం. ఇలా ప్రభుత్వ పధకాలు, కార్యక్రమాల వివరాలను పొందుపర్చి రూపొందించిన క్యాలెండర్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. 

తేదీల వారిగా వివరాలు: 

    మే 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తారు 
    జూన్ 4న వైఎస్ఆర్ వాహన మిత్రల ద్వారా రూ.10 వేల  ఆర్థిక సాయం
    జూన్ 10న నాయీబ్రాహ్మణులు, రజకులు, టైలర్ లకు రూ.10 వేల ఆర్థిక సాయం 
    జూన్ 17న వైఎస్సార్ నేతన్న నేస్తం పేరిట ఆర్థిక సాయం 
    జూన్ 24న వైఎస్సార్ కాపు నేస్తం అమలు 
    జూన్ 29న ఎంఎస్ఎంఈ లకు రెండో విడతగా రూ. 450 కోట్లు విడుదల
    జూలై 1న  108, 104 కొత్త అంబులెన్సులు  ప్రారంభం
    జూలై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా 27 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ
    జూలై 29న రైతులకు వడ్డీ లేని రుణాలు
    ఆగస్టు 3న వైఎస్సార్ విద్యా కానుక ప్రారంభం
    ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ
    ఆగస్టు 12న వైఎస్సార్ చేయూత పథకం కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.18,750 అందజేత
    ఆగస్టు 19న వైఎస్సార్ వసతి దీవెన కింద పిల్లల తల్లులకు రూ. 10 వేల చొప్పున తొలి విడత చేయూత
    ఆగస్టు 26న 15 లక్షలు వైఎస్సార్ ఇళ్ల నిర్మాణం ప్రారంభం
    సెప్టెంబర్ 11న వైఎస్సార్ ఆసరా ప్రారంభం
    సెప్టెంబర్ 25న వైఎస్సార్ విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల
    అక్టోబర్ లో రైతు భరోసా రెండో విడత సాయం
    నవంబర్ లో రెండో విడత విద్యాదీవెన
    డిసెంబర్ లో అగ్రి గోల్డ్ బాధితులకు సాయం
    వచ్చే ఏడాది జనవరిలో అమ్మ ఒడి కార్యక్రమం
    రైతు భరోసా చివరి విడత సాయం
    వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విద్యా దీవెన మూడో దఫా సాయం
    మార్చిలో పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?