విజయవాడ: ప్రభుత్వ వైద్యురాలి నిర్వాకం.. బ్లాక్ ఫంగస్ చికిత్స పేరుతో రూ.22 లక్షలు వసూలు

By Siva KodatiFirst Published Aug 11, 2021, 3:36 PM IST
Highlights

బ్లాక్ ఫంగస్ చికిత్స పేరుతో ఏకంగా రూ.22 లక్షలు దోచేశారు ప్రభుత్వ వైద్యురాలు. ఇందుకు సంబంధించి విజయవాడ జీజీహెచ్‌లో పనిచేస్తున్న  డాక్టర్ తోట వాణి సుప్రియను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. 

విజయవాడ జీజీహెచ్‌లో దారుణం జరిగింది. మహిళా డాక్టరు రోగులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధితులు ఫిర్యాదు చేశారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు రోగి నుంచి దాదాపు రూ.22 లక్షలు వసూలు చేశారు డాక్టర్. అత్యవసర మందులు ఇప్పిస్తానని కడప జిల్లా వాసుల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారు. రూ.20 లక్షలను డాక్టర్ తోట వాణి సుప్రియ ఖాతాలో వేశారు బాధితులు. మే లో బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు విజయలక్ష్మీ అనే మహిళ. కడప జిల్లాకు చెందిన విజయలక్ష్మీ నుంచి వైద్యం కోసం డబ్బు వసూలు చేశారు. డాక్టర్ తోట వాణి సుప్రియపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబసభ్యులు.

వాణి సుప్రియ ఖాతాకు అమెరికా నుంచి విజయలక్ష్మీ కుమారుడు అనిల్ దేవ్ శరత్ 22 లక్షలు పంపినట్లు ఆధారాలున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో లక్షల వసూలుపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై సూపరింటెండెంట్ దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ వాణీ సుప్రియను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇక పెండింగ్‌లో వున్న వేతన బకాయిలను సైతం నిలిపివేశారు. అయితే ప్రత్యేక వైద్యం పేరుతో కాంట్రాక్ట్ డాక్టర్ డబ్బు వసూలు చేశారని తెలిపారు విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ జగన్మోహన్.

ప్రభుత్వ ఆసుపత్రిలో డబ్బులు వసూలు చేసే డాక్టర్లు ఎవరూ లేరని చెప్పారు. బాధితురాలి అబ్బాయి అమెరికాలో వుంటూ అమ్మ మీద ప్రేమతో ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించారని ఘటన జరిగి నాలుగు నెలలు అవుతుందని వివరించారు. నిన్న 60 ఏళ్ల వృద్ధుడు దీని మీద ఫిర్యాదు చేశారని చెప్పారు . అయితే డాక్టర్ వాణి సుప్రియ అందుబాటులో లేరని ఇప్పటికే పై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ తెలిపారు. 

click me!