జెసికి సవాల్ విసిరిన గోరంట్ల మాధవ్ కు వైసిపిలో కీలక పదవి

By pratap reddyFirst Published Feb 1, 2019, 6:32 AM IST
Highlights

తన పోలీసాఫీసరు పదవికి రాజీనామా చేసిన గోరంట్ల మాధవ్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన విషయం తెలిసిందే. హిందూపురం ఎంపీ టికెట్ ఆశించి ఆయన వైసీపీ కండువా కప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.

హైదరాబాద్: మాజీ సిఐ గోరంట్ల మాధవ్ కు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డిపై మీసం మెలేసి అనంతపురం జిల్లాలో గోరంట్ల మాధవ్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

తన పోలీసాఫీసరు పదవికి రాజీనామా చేసిన గోరంట్ల మాధవ్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన విషయం తెలిసిందే. హిందూపురం ఎంపీ టికెట్ ఆశించి ఆయన వైసీపీ కండువా కప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. గురువారం రాత్రి గోరంట్లకు వైసీపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. 

Latest Videos

హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా గోరంట్ల మాధవ్‌‌ను వైసీపీ అధినేత వైఎస్ జగన్ నియమించారు. ఈ విషయం తెలుసుకున్న గోరంట్ల, ఆయన అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు.
 
పోలీసు అధికారిగా సిబ్బందిపై ఎంపీ జేసి చేసిన వ్యాఖ్య‌లపై మాధవ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అనంతరం తన సీఐ పదవికి రాజీనామా వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.

click me!