ఏపీకి రోజూ బ్లాక్‌ డే: కేంద్రంపై సుజనా విమర్శలు

Published : Jan 31, 2019, 07:36 PM IST
ఏపీకి రోజూ బ్లాక్‌ డే: కేంద్రంపై సుజనా విమర్శలు

సారాంశం

కేంద్రం తీరు కారణంగా ప్రతి రోజూ ఏపీకి బ్లాక్‌ డే మాదిరిగా ఉందని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి  విమర్శించారు.పార్లమెంట్ చివరి సమావేశాల్లోనైనా ఏపీకి న్యాయం చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

న్యూఢిల్లీ: కేంద్రం తీరు కారణంగా ప్రతి రోజూ ఏపీకి బ్లాక్‌ డే మాదిరిగా ఉందని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి  విమర్శించారు.పార్లమెంట్ చివరి సమావేశాల్లోనైనా ఏపీకి న్యాయం చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

గురువారం సాయంత్రం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏపీ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన విభజన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  ప్రజాస్వామ్యంలో బేదాభిప్రాయాలు ఉంటే ఏకాభిప్రాయాలు తీసుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఐదేళ్లలో ఏపీకి ప్రతి రోజూ బ్లాక్‌డే గా మారిందన్నారు. 

ఏపీకి కియా మోటార్స్‌ను కష్టపడి తీసుకొస్తే.. తమ వల్లే కియా మోటార్స్ వచ్చిందని చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు.  మేకిన్ ఇండియాపై సుజనా చౌదరి విమర్శలు గుప్పించారు. రైల్వే జోన్ ఇప్పుడు ఇచ్చినా ఉపయోగం లేదన్నారు. త్వరలో కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వం విశాఖకు రైల్వే జోన్ ను ఇస్తారని చెప్పారు.


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్