రాత్రి మందు తాగడం, పగలు కొట్టడం: హీరో బాలకృష్ణపై గోరంట్ల మాధవ్ వ్యాఖ్య

Published : Mar 07, 2021, 09:34 AM IST
రాత్రి మందు తాగడం, పగలు కొట్టడం: హీరో బాలకృష్ణపై గోరంట్ల మాధవ్ వ్యాఖ్య

సారాంశం

హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ అభిమానిపై చేయిచేసుకోవడం మీద ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. బాలకృష్ణ వ్యవహారంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

అనంతపురం: ఓ అభిమానంపై సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేయి చేసుకోవడంపై ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. టీడీపీ అభిమానిపై బాలకృష్ణ చేయి చేసుకోవడాన్ని ఆయన ఖండించారు అనంతపురంలోని 25వ డివిజన్ వైసీపీ అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాస్ కు మద్దతుగా మాధవ్ శనివారం ప్రచారం నిర్వహిచారు. 

ఈ సందర్భంగా ఆయన బాలయ్యపై వ్యాఖ్యలు చేశారు. రాత్రి మందు తాగడం, పగలు ప్రజలను కొట్టడం బాలకృష్ణకు మామూలేనని ఆయన అన్నారు. టీడీపీకి ఓటేసిన పాపానికి అభిమానులు శిక్ష అనుభవించాలా అని ఆయన ప్రశ్నించారు.  

టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ తమ మార్కు ఆగ్రహాన్ని మరోసారి చూపించిన విషయం తెలిసిందే. హిందూపురంలో ప్రచారం చేస్తున్న బాలకృష్ణ ఇందులో భాగంగా ఓ ఇంట్లోకి వెళ్లారు. అక్కడి ఆయన మాట్లాడుతున్న సమయంలో ఓ అభిమాని వీడియో తీశాడు. 

దాంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అభిమానిపై చేయి చేసుకున్నారు. వ్యక్తిగతంగా మాట్లాడుతుంటే వీడియో తీస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఆయన అభిమానులపై ఇటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి.

ఇదిలావుంటే, తనపై విమర్శలు చేస్తున్న రాజకీయ ప్రత్యర్థులకు టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ హెచ్చరికలు జారీ చేశారు. మున్నిపల్లో ఎన్నికల నేపథ్యంలో ఆయన శనివారం తన సొంత నియోజకవర్గం హిందూపురంలో ప్రచారం చేస్తున్నారు. తన ప్రసంగంలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు.

తాను తిడితే తనంత బూతులు తిట్టేవారు మరొకరు ఉండరని ఆయన అన్నారు. తనకు సంస్కారం ఉందని, అయితే ఎదుటివాళ్లు నోరు పారేసుకుంటే ఊరుకోనని ాయన అన్నారు. తనకు ఒక్క పని కాదు, అనేక పనులు ఉన్నాయని చెప్పారు. 

బసవతారకం ఆస్పత్రి చైర్మన్ గా తాను రోగులకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు సినిమాల ద్వారా ప్రజలకు వినోదాన్ని పంచుతున్నానని బాలకృష్ణ చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

పోలవరం ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు | CM Chandrababu Reviews Polavaram Project Works
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ | AP State Food Commission Chairman