గుంటూరులో కరోనా జోరు: ఏపీలో మొత్తం 20,57,562కి చేరిక

Published : Oct 11, 2021, 07:14 PM IST
గుంటూరులో కరోనా జోరు: ఏపీలో మొత్తం 20,57,562కి చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టాయి. గత 24 గంటల్లో 310 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు కరోనాతో మరణించారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 14,256 కి చేరింది. రాష్ట్రంలో కరోనా కేసులు 20,57,562కి చేరుకొన్నాయి.

అమరావతి:ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) రాష్ట్రంలో కరోనా (corona cases) కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో23,022 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 310 మందికి కరోనా నిర్ధారణ అయింది.  రాష్ట్రంలో కరోనా కేసులు 20,57,562కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి  ఇద్దరు మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 14,256 కి చేరింది. 

also read:ఏపీలో కొత్తగా 693 మందికి కరోనా పాజిటివ్,.. తూ.గోలో స్వల్పంగా పెరిగిన కేసులు

గడిచిన 24 గంటల్లో 994 మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 20లక్షల 36వేల 048 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 9,258 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,87,67,963 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో002,చిత్తూరులో 045, తూర్పుగోదావరిలో038,గుంటూరులో054,కడపలో 007, కృష్ణాలో028, కర్నూల్ లో004 నెల్లూరులో051, ప్రకాశంలో 023,విశాఖపట్టణంలో 042,శ్రీకాకుళంలో006, విజయనగరంలో 004,పశ్చిమగోదావరిలో 006 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున మరణించారు.  దీంతో రాష్ట్రంలో  కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,256కి చేరుకొంది.

 
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,57,691, మరణాలు 1093
చిత్తూరు-2,45,176, మరణాలు1926
తూర్పుగోదావరి-2,92,534, మరణాలు 1286
గుంటూరు -1,76,907,మరణాలు 1225
కడప -1,15,242, మరణాలు 641
కృష్ణా -1,18,156,మరణాలు 1399
కర్నూల్ - 1,24,064,మరణాలు 852
నెల్లూరు -1,45,783,మరణాలు 1043
ప్రకాశం -1,37,977, మరణాలు 1105
శ్రీకాకుళం-1,22,825, మరణాలు 785
విశాఖపట్టణం -1,57,071, మరణాలు 1122
విజయనగరం -82,844, మరణాలు 670
పశ్చిమగోదావరి-1,78,377, మరణాలు 1109

 

 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kandula Durgesh: అసెంబ్లీ లో కందుల దుర్గేష్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
పోలీసులపై రాజకీయ కక్షలా? వైసీపీకి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన హోంమంత్రి అనిత | Asianet News Telugu