ఎమ్మెల్యేపై పొగడ్తలు: గుత్తి సీఐ రాముపై బదిలీ వేటు, ఎస్పీ కార్యాలయానికి అటాచ్డ్

Published : Sep 30, 2021, 11:15 AM ISTUpdated : Sep 30, 2021, 11:50 AM IST
ఎమ్మెల్యేపై పొగడ్తలు: గుత్తి సీఐ రాముపై బదిలీ వేటు, ఎస్పీ కార్యాలయానికి అటాచ్డ్

సారాంశం

అనంతపురం జిల్లా గుత్తి సీఐ రాముపై పోలీస్ శాఖపై బదిలీ వేటు పడింది. గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిని సింహంతో పోలుస్తూ సీఐ  వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్లు సీఐ  (gooty ci )రాముపై (Ramu)పోలీస్ శాఖ బదిలీ వేటేసింది. గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిని (Guntakal mla venkatarami reddy) సింహంతో (lion)పోల్చిన సీఐ రామును  ఎస్పీ (sp)కార్యాలయానికి అటాచ్డ్ (attach) చేస్తూ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు గురువారం నాడు ఆదేశించారు.

also read:మన ఎమ్మెల్యే సింహం.. సీఐ వివాదాస్పద వ్యాఖ్యలు..!

గుత్తి పట్టణంలోని ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు సీఐ రాము కూడ ఈ నెల 29వ తేదీన పాల్గొన్నారు. ఈ సమయంలో సీఐ రాము ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు.  ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి సింహం లాంటివాడని  ఆయన చెప్పారు.ఈ పొగడ్తలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీంతో సీఐ రామును  ఎస్పీ కార్యాలయానికి అటాచ్ట్ చేస్తూ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.గుత్తి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఇటీవలనే బదిలీ అయ్యారు. ఎస్ఐ సుధాకర్ యాదవ్ డీఎస్పీకి రాసినట్టుగా చెబుతున్న ఓ లేఖ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?