ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. వేలాది ఉద్యోగాలు

Published : Sep 18, 2018, 01:09 PM ISTUpdated : Sep 19, 2018, 09:29 AM IST
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. వేలాది ఉద్యోగాలు

సారాంశం

పలు శాఖల్లో ఖాళీగా ఉన్న 20వేలకు పైగా పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు.

ఏపీలో నిరుద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. పలు శాఖల్లో ఖాళీగా ఉన్న 20వేలకు పైగా పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. గ్రూప్‌-1,2,3, డీఎస్సీ, పోలీసు శాఖలతో సహా వివిధ శాఖల్లోని 20,010 ఖాళీల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

ఈ ఉదయం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో చంద్రబాబు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఏయే శాఖల్లో ఖాళీలు ఉన్నాయనేదానిపై ఆధికారులతో సమీక్షించారు. 20,010 ఖాళీల భర్తీకి ఈ సమావేశంలో సీఎం ఆమోదం తెలిపారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఈ నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నియామకాల ప్రక్రియను త్వరిత గతిన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీలో దీనిపై సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

విజయవాడలో కారు ధరకే 2BHK ప్లాట్స్... భవిష్యత్ లో ఇక్కడ రియల్ బూమ్ ఖాయం
Rain Update:తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాంతాల్లో వర్ష బీభత్సమే! | Weather Update | Asianet News Telugu