హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న మహేందర్.. లేఖలో ఏం రాశాడంటే...?

Published : Sep 18, 2018, 12:48 PM ISTUpdated : Sep 19, 2018, 09:29 AM IST
హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న మహేందర్.. లేఖలో ఏం రాశాడంటే...?

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మరో నిండు ప్రాణం బలైంది. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గానికి చెందిన 10వ తరగతి చదువకుంటున్న మహేంద్ర అనే బాలుడు హోదా రావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.  

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మరో నిండు ప్రాణం బలైంది. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గానికి చెందిన 10వ తరగతి చదువకుంటున్న మహేంద్ర అనే బాలుడు హోదా రావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహం వద్ద లభించిన సూసైడ్ నోట్‌లో తాను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనేది రాశాడు.. అందులో ఏముందంటే..

‘‘ నా పేరు జీ. మహేంద్ర... మాకు చానా అప్పులున్నాయి...అట్టనే మా నాయనకి కూడా ఆరోగ్యం బాగోదు..ఒకాల నేను చదువుకున్నా ఉద్యోగం రాదు.. మన రాష్ట్రానికి ప్రత్యేకఓదా అన్నా ఇచ్చుంటే.. మా యన్నకి యాదో ఒక ఉద్యోగం వచ్చేది.. ఓదా వల్ల మనకు చానా మేలు జరుగుతుందట.. నేను టీవీలో వార్తల్లో విన్నాను..తెలంగాణ కోసం చానామంది సచ్చిపోయినారు.. ఓదా కోసం నేను సచ్చిపోతున్నాను.. ఏట్లా ఏవురికీ లాభం ఏం లేదు’’

"

ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ.. టెన్త్ విద్యార్థి ఆత్మహత్య

PREV
click me!

Recommended Stories

Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ
Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు