పవన్ కళ్యాణ్ సీఎం అయితే.. : జ‌న‌సేన ప్రధాన కార్యదర్శి నాగ‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు

Published : May 08, 2023, 12:23 AM IST
పవన్ కళ్యాణ్ సీఎం అయితే.. :  జ‌న‌సేన ప్రధాన కార్యదర్శి నాగ‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు

సారాంశం

Vijayawada: వ‌చ్చే ఎన్నిక‌ల కోసం జనసేన ముమ్మ‌రంగా ప్రాణాళిక‌లు సిద్ధం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మంలోనే పార్టీ  ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాగబాబు రంగంలోకి దిగి.. నేరుగా జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు. యలమంచిలి నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని నాగబాబు ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.   

JanaSena leader Nagendra Babu: జ‌న‌సేన అధినేత, సీని న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అయితే, స్వ‌ర్ణ‌యుగం వ‌స్తుంద‌ని ఆ పార్టీ నాయ‌కుడు నాగ‌బాబు అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తామ‌నీ, రానున్న‌ద‌ని జ‌న‌సేన ప్ర‌భుత్వ‌మేన‌నీ ఆయ‌న పేర్కొన్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల కోసం జనసేన ముమ్మ‌రంగా ప్రాణాళిక‌లు సిద్ధం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మంలోనే పార్టీ  ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాగబాబు రంగంలోకి దిగి..  నేరుగా జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు. యలమంచిలి నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని నాగబాబు ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  "జ‌న‌సేన అధినేత, సీని న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అయితే, స్వ‌ర్ణ‌యుగం వ‌స్తుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తాం.. రాష్ట్రంలో రానున్న‌ద‌ని జ‌న‌సేన ప్ర‌భుత్వ‌మే.." అని నాగబాబు పేర్కొన్నారు. 

రాష్ట్రంలోని ఇత‌ర రాజ‌కీయ పార్టీల‌ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. లక్షల కోట్లు దోచుకోవడానికి వస్తున్నప్పుడు ప్రజా ప్రయోజన పాలనకు ఎందుకు రాద‌ని పేర్కొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్ణయుగం వస్తుందని వెల్లడించారు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో యలమంచిలి జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో నాగబాబు ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న కాలంలో ఖచ్చితంగా జనసేన ప్రభుత్వమే ఏర్పడుతుందని ధీమావ్య‌క్తం చేశారు. జనసేన ప్రభుత్వంలో రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు ప్రతీ ఒక్కరికీ ప్రయోజనకరమైన పాలన ఉంటుందని చెప్పారు.

అవినీతి నాయకులు దోచుకోవడానికి లక్షల కోట్ల రూపాయలు వస్తున్నప్పుడు ప్రజా ప్రయోజన పాలన కోసం ఎందుకు రాదు అని వివరించారు. వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని దాదాపుగా దోచుకున్నారని, మరొక్కసారి వైసీపీని నమ్మితే మనకు భవిష్యత్తు లేకుండా చేస్తారని అన్నారు. ఎత్తులు, పొత్తుల గురించి జ‌న‌సేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి వదిలేసి జనసేన పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసే ప్రతీ వ్యక్తిని గెలిపించాల్సిన బాధ్యత జన సైనికులు, వీర మహిళలపై ఉన్నదని అన్నారు. యువతను గంజాయి మత్తుకు, రవాణాకు అలవాటు చేసి వేలాది మంది యువకులను జైళ్లలో మగ్గెలా చేసిన ఘనత వైసీపీకి దక్కుతుందని అధికార పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. 

గంజాయిని కేరాఫ్ ఆంధ్ర ప్రదేశ్ అని చెప్పుకునే పరిస్థితికి వైస్సార్సీపీ ప్ర‌భుత్వ నాయ‌కులు తెచ్చారని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన ఆస్తులు దాదాపుగా దోచుకున్నారని, ఆలయానికి వచ్చే ఆదాయం ఎటు పోతోందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నదని విమ‌ర్శించారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని బాధ్యతతో స్వీకరించాననీ, జనసేన అభ్యర్థులను గెలిపించటమే లక్ష్యంగా పని చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం నుంచి యలమంచిలి వరకూ జరిగిన ర్యాలీలో వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు రోడ్లపై నిలబడి నాగబాబుకు ఘన స్వాగతం పలికారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nimmala Ramanaidu Highlights Rayalaseema Irrigation Projects & Water Disputes | Asianet News Telugu
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం పొంచివుందా..? ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు