మణిపూర్‌ హింస .. జగన్ స్పెషల్ ఫ్లైట్స్‌లో తిరగొచ్చు, విద్యార్ధుల కోసం విమానం పెట్టరా : అచ్చెన్నాయుడు విమర్శలు

Siva Kodati |  
Published : May 07, 2023, 05:57 PM IST
మణిపూర్‌ హింస .. జగన్ స్పెషల్ ఫ్లైట్స్‌లో తిరగొచ్చు, విద్యార్ధుల కోసం విమానం పెట్టరా : అచ్చెన్నాయుడు విమర్శలు

సారాంశం

మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్ధులను రక్షించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. రంగులు వేసేందుకు, ప్రచారం చేసుకునేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని.. కానీ ఆపదలో వున్న విద్యార్ధులను ఆదుకోరా అని అచ్చెన్నాయుడు నిలదీశారు. 

మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్ధులను రక్షించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విపక్షాలపై అక్రమ కేసులు పెట్టడంలో వున్న శ్రద్ధ విద్యార్ధులను కాపాడటంలో లేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో వున్నా , అధికారంలో వున్నా తెలుగువారి సంక్షేమం కోసం టీడీపీ కృషి చేస్తూనే వుంటుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 

రంగులు వేసేందుకు, ప్రచారం చేసుకునేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని.. కానీ ఆపదలో వున్న విద్యార్ధులను ఆదుకోరా అని అచ్చెన్నాయుడు నిలదీశారు. స్పెషల్ ఫ్లైట్స్‌లో తిరిగే జగన్.. విద్యార్ధుల కోసం ఒక ప్రత్యేక విమానం కూడా ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు. మణిపూర్‌లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన విద్యార్ధులను వెంటనే తీసుకురావాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. 

ALso Read: మణిపూర్ హింస : హెల్ప్‌డెస్క్‌లు, స్పెషల్ ఫ్లైట్స్‌తో పౌరుల తరలింపు, ఏ రాష్ట్రం ఎలాంటి ఏర్పాట్లు చేసిందంటే..?

మరోవైపు ఈ విమర్శలపై స్పందించారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయడంలో కొంచెం ఆలస్యం జరిగిందన్నారు. విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని.. ప్రతి ఒక్క విద్యార్ధిని వెనక్కి తీసుకొస్తామని బొత్స స్పష్టం చేశారు. ముందుగా 150 మందిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశామని సత్యనారాయణ తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

కోటంరెడ్డి వ్యాఖ్యలపై జగన్ ఫస్ట్ రియాక్షన్ | YS Jagan On Kotamreddy Sridhar Reddy | Asianet Telugu
Navratri Celebrations: బెజవాడలో రాగా దాండియా ఉత్సవ్ 2.0.. ఘనంగ నవరాత్రి వేడుకలు