బంగారు సీమలో... రిఫైనరీ కృష్ణాలో

Published : Jan 21, 2017, 04:06 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
బంగారు సీమలో... రిఫైనరీ కృష్ణాలో

సారాంశం

తెలంగాణా ఉద్యమం వల్ల  ఆగిపోయిన బంగారు వెలికితీత పున: ప్రారంభానికి చర్యలు. అయితే రిఫైనరీ  కృష్ణా జిల్లాలో ఏర్పాటుకు చర్యలు

 

తెలంగాణా ఉద్యమం, తర్వాత రాష్ట్ర విభజన వల్ల ఆగిపోయిన రాయలసీమ  బంగారు ఉత్పత్తి కార్యకలాపాలు మళ్లీ మొదలవుతున్నాయి.

 

ఇంతకు ముందే రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో బంగారు నిల్వ సమృద్ధిగా కనిపించింది. దీనిని వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభత్వం కృషిమొదలుపెట్టింది. ఈ బంగారు వెలికి తీసి, ముడిఖనిజాన్ని శుద్ధి చేసే కర్మాగారం కృష్ణాజిల్లాలో ఏర్పాటు చేస్తారట. దీనికోసం,దాదాపు  10   సంవత్సరాల తర్వాత జియో మైసూర్ (సర్వీసెస్ ) వీగిపోయిన  కేంద్ర అనుమతులను పొడిగించుకునేందుకు చర్యలు మొదలుపెట్టింది. ఈ సంస్థ కర్నూలు జిల్లాలోని జొన్నగిరి బెల్ట్ నుంచి భారీగా  బంగారు ముడిఖనిజాన్ని వెలికితీసేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉంది.

 

అయితే, దీనిని తీసుకెళ్లి కృష్ణజిల్లా ఏర్పాటు చేయనున్న ఒక బంగారు ప్రాసెసింగ్ యూనిట్ లో శుద్ధి  చేయడమనేదే అర్థం కాని విషయం. అపుడు అమరావతికి బంగారు కాంతులురావచ్చు. కాని రాయలసీమకు ఉద్యోగాలు లేక, ఉన్నవి రాక, పంటలు లేక నానా  అగచాట్లు పడుతున్నారు. ఇలాంటి నిర్ణయాలు ఈ ప్రాంతాన్ని ఎటు నడిపిస్తాయో, ఇపుడు సాగుతున్న ఉక్కు ఉద్యమం వైపు చూస్తే అర్థమవుతుంది.

రాయలసీమ ఎర్రచందనం లాగే, బంగారం కూడా రాయలసీమ అభివృద్ధికి  కాకుండా వరల్డ్ క్లాస్ అమరావతికో, ఇన్వెస్టర్ల వేటలో  జరిపే ప్రపంచయాత్రల విమాన  ఖర్చులకో పోతుందని వేరే చెప్పనవసరంలేదు.

 

రాయలసీమ బంగారు కథ ఇది.

 

రాయలసీమ నాలుగు జిల్లాలలో బంగారు నిక్షేపాలు కనుగొన్నారు. దీని మీద లోతైన అధ్యయనం కోసం జియోమైసూర్ (ఇండియా)ప్రవేట్ లిమిటెడ్ అనే బంగారు గనుల తవ్వకాల వ్యాపరంలో ఉండే సంస్థకు 6 చదరపు కి.మీ మేర  లైసెన్స్ కూడా ఇచ్చారు.  ఈ కంపెనీ సర్వేకి అటవీ శాఖ అనుమతి కావాలి కాబట్టి జనవరి 5 వ తేదీన  ఒక దఫా విచారణ జరిగింది. ఈ విచారణ పూర్తయి, అనుమతి  వస్తుంది. ఆపైన ఖచ్చితమయిన  అంచనాల కోసం బోరింగులేయడం మొదలుపెడతారు.

 

జియోమైసూర్ సంస్థకు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి బెల్ట్ బంగారు సేకరించేందుకు 2007 లోనే లైసెన్స్ లభించింది.

 

ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 1.22 కోట్ల టన్నుల బంగారులభించే ఖనిజం ఉంది. చిత్తూరుజిల్లాలో రామగిరి ప్రాంతం, కడప జిల్లాలోని తేల్లకొండ, కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి (తుగ్గలి), సమీపంలోని అనంతపురంలలో  బంగారు నిక్షేపాలున్నయి. వీటికోసం జియోమైసూర్  లైసెన్స్ సంపాదించాక పర్యావరణ అనుమతి కూడా పొందింది.  ఈ కంపెనీ కార్యక్రమాలకు తెలంగాణా ఉద్యమం అడొచ్చింది. ప్రాజక్టు జాప్యమై పర్యావరణ అనుమతి వీగిపోయింది.  2015 జూన్ లో ఈ కంపెనీ, తెలంగాణ ఉద్యమం వల్ల జాప్యం అయింది  కాబట్టి పర్యావరణ అనుమతి పొడిగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.   జోన్నగిరి బెల్ట్ నుంచి ఏడాదికి 0.30 మిలియన్ టన్నలు ముడిఖనిజాన్ని వెలికి తీయాలని కంపెనీ ప్రణాళిక.

 

కృష్ణ జిల్లా జగ్గయ్య పేటలో కూడా కొంతనిక్షేపం కనిపించింది. అయితే,  జొన్నగిరి బెల్ట్ నుంచి తీసిన బంగారు ముడిఖనిజాన్ని శుద్ధి చేసే కర్మాగారం కృష్ణ జిల్లాలో ఏర్పా టు చేసేందుకు ప్రయత్నాలు జరగుతుండటం విశేషం.

 

జొన్నగిరి పురాతన బంగారు క్షేత్రం. ఇక్కడ పూర్వమే బంగారు ఉత్పత్తిచేసిన ఆనవాళ్లను జియో మైసూరు సంస్థకనుగొంది. ఇది రామగిరి, హట్టి ల కొనసాగింసే. ఈ ప్రాంతమంతా ఈస్టర్న్ ధార్వాడ్  క్రేటాన్ ప్రాంతం కిందికి వస్తుంది.

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: చంద్రబాబు పంచ్ లకి పడి పడి నవ్విన నారా భువనేశ్వరి| Asianet News Telugu
Vangalapudi Anitha Strong Warning to Jagan: గుర్తుపెట్టుకో జగన్ ఎవ్వరినీ వదిలిపెట్టం |Asianet Telugu